ఓ ఛానల్ నుంచి ఇంకో ఛానల్‌కి జర్నలిస్టులు వెళ్ళడం కొత్తేమీ కాదు కదా.! కానీ ఇక్కడ రజనీకాంత్ వెళ్ళటం లేదట వెళ్ళిపోమన్నారట. గతంలో స్వప్న టీవీ9లో వుండేవారు.. ఆ తర్వాత మరో ఛానల్ కోసం పనిచేస్తున్నారు. ఇంతకీ, రజనీకాంత్ రగడ సంగతేంటి అంటే, ఛానల్ యాజమాన్యం ఆయన తీరు పట్ల అంత సంతృప్తిగా లేదట. ఈ క్రమంలో మురళీకృష్ణ అనే మరో సీనియర్ జర్నలిస్టుకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారట. రేపో మాపో రజనీకాంత్, టీవీ9 నుంచి ఔట్ అయిపోతారనీ.. ‘రవిప్రకాష్ సన్నిహితుడు’ అనే ఇమేజ్ కారణంగానే రజనీకాంత్‌కి ఈ సమస్యలనీ వస్తున్నాయని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సినిమా స్టార్లకే కాదు.. న్యూస్ ఛానళ్ళలో పనిచేసే సీనియర్ జర్నలిస్టులకీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంటుంది.ఎవరన్నా ఏమన్నా అనుకోండి.. ఫాలోయింగ్ మాత్రం కనిపిస్తోంది. ఆ మధ్య వెంకటకృష్ణకి బోల్డంతమంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో కనిపించారు. మూర్తి అనే మరో సీనియర్ జర్నలిస్టు పరిస్థితీ ఇంతే. టీవీ9 రవిప్రకాష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన కొన్నాళ్ళ క్రితమే టీవీ9 సీఈఓ పదవి నుంచి తొలగించబడ్డా, ఆయనకున్న ఫాలోయింగ్ తగ్గలేదు. ‘వియ్ సపోర్ట్ రవిప్రకాష్’ అంటూ రవిప్రకాష్‌ని అభిమానించే చాలామంది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటారు.
ఇక, ఇప్పుడు ‘వి సపోర్ట్ రజనీకాంత్’ అంటున్నారు. దీనిక్కారణం టీవీ9 నుంచి రజనీకాంత్ ‘ఔట్’ అవబోతున్నారన్న ప్రచారమే. ఇందులో వింతేముంది.. ఓ ఛానల్ నుంచి ఇంకో ఛానల్‌కి జర్నలిస్టులు వెళ్ళడం కొత్తేమీ కాదు కదా.
సీనియర్ జర్నలిస్టులైతే సరిపోరు.. తమను తాము ప్రమోట్ చేసుకోవాలంటే, ఇటు మీడియాలోనూ కొంత బలగం వుండాలి.. ఇంకోపక్క సోషల్ మీడియాలోనూ తమ పేరు మార్మోగిపోయేలా ప్రచారం చేసుకోగలగాలి. అంతా బాగానే వుందిగానీ, రజనీకాంత్ ఔటయిపోయి.. మురళీకృష్ణకి అదనపు పవర్ వస్తే.. ఆయన ఎంత కాలం ఆ పవర్‌లో కొనసాగుతారు? అప్పుడు మళ్ళీ ‘వి సపోర్ట్ మురళీకృష్ణ’ అంటూ రచ్చ షురూ అవుతుందేమో! ఎన్నో వింతల్ని చూస్తున్న మనకి ఇదేం పెద్ద వింత కాదులెండి.