చంద్రబాబు సమీక్షా సమావేశంలో ‘జనసేన’కు మంచి మార్కులు

ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండబోతున్నదన్న దాని మీద ఎవరికీ స్పష్టత లేదు. రాష్ట్ర ఎన్నికల మీద జరిపిన సర్వేలేవీ జనసేను కు అంత ప్రాముఖ్యం ఇవ్వలేదు.

ఒక్క సర్వే కూడా జనసేన పార్టీకి పట్టమనిపదిసీట్లివ్వలేదు.

అసెంబ్లీ ఎన్నికల కు సంబంధించి చాలా సర్వేలు మూడునాలుగు సీట్ల కంటే ఎక్కవ ఇవ్వ లేదు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల గెలుస్తాడని కూడా చెప్పడం లేదు. ఆయనకు భీమవరం కంటే గాజువాకలోనే బాగా ఉందని అక్కడొక్కచోటే గెలిచే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెప్పాయి.

ఇక పార్లమెంటుకు సంబంధిందించి ఈ సర్వేలు చాలా మటుకు జనసేనకు జీరో లేదా ఒకటి కంటే ఎక్కువ స్థానాలివ్వలేదు.

జనసేన పవన్ కల్యాణ్ కూడా విసృతంగా ప్రచారం చేశారు. ఆయన సభలకువిపరీతంగా జనం వచ్చారు. మరి జనంలో జనసేననాడి ఇంతవీక్ గా ఉందా. జనసేన అధిపతి ప్రచారం ప్రారంభమయింది తానే ముఖ్యమంత్రిఅని. ఆయనకు కుమారస్వామి ఆదర్శమయ్యారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని, అపుడు కుమారస్వామిలాగా తానెందుకు ముఖ్యమంత్రి కాకూడాదని ప్రశ్నిస్తూవచ్చారు. మరి అంతధీమాగ ఉన్న పార్టీకి సర్వేలన్నీ నెగెటివ్ గా ఉండటమేమిటి?

అయితే, తొలిసారిగా జనసేన పార్టీని తీసేయడానికి వీల్లేదని ఆపార్టీకూడా బాగా కష్టపడిందనేసర్టిఫికెట్ తెలుగుదేశం సర్కిల్ నుంచి వచ్చింది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి సమీపంలోని హ్యాపీ రిస్టార్ట్స్ లో  చేస్తున్న సమీక్షా సమావేశంలో ఈ ప్రస్తావన వచ్చింది. ఈ విషయం ప్రస్తావించింది కూడా ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి ఎంపి అభ్యర్థి మాగంటి రూప.


ఈ సమావేశంలో అన్ని పార్టీల పనితీరు ఎలా ఉండవచ్చనే దాని మీద ముఖ్యమంత్రి నాయకుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా రూప మాట్లాడుతూ జనసేన గురించి ఆసక్తి కరమయిన అభిప్రాయాలు వెల్లడించారు. గోదావరి జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఇచ్చిందని ఆమె ముఖ్యమంత్రి దృష్టికీ తీసుకువచ్చి సమావేశంలో ఉన్నవారందరిని ఆశ్చర్య పరిచారు.

ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఉండదనుకోవడానికి వీల్లేదని రూప చెప్పారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో జనసేనకు అసెంబ్లీ స్థానాలు బాగానే దక్కే అవకాశం ఉందని ఆమె చెప్పారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో తాను వూహించిన దానికంటే బలంగా జనసేన పార్టీ పోటీ ఇచ్చిందని ఆమె అంగీకరించారు. యువకులలో, మధ్య తరగతి కుటుంబాలలోకి జనసేన బాగా చొచ్చుకుపోయిందని, ఈ వర్గాల వోట్లు జనసేనకు ఎక్కువగా పడ్డాయని తాను భావిస్తున్నట్లు రూపాచెప్పారనిటిడిపి వర్గాలు వెల్లడించాయి.

మిగతా జిల్లాల సంగతి తనకుతెలియదని, ఉభయగోదావరి జిల్లాలో తాను జనసేన ప్రచారం తీరు స్వయంగా చూశానని చెబుతూ తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలు వచ్చినా, జనసేన బలమయిన శక్తిగా తయారవుతుందని ఆమె అన్నట్లు తెలిసింది.
ఇది ఇలా ఉంటే, తాను తిరిగిసినిమాలలో నటించబోతున్నట్లు ప్రచారమవుతున్న వార్తలను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాన్ ఖండించారు. ఇక నుంచి పూర్తి సమయంలో ప్రజాజీవితానికే నని స్పష్టం చేస్తూ ఒక ప్రకటనవిడుదల చేశారు.


‘నేను తర్వలో ఒక సినిమా చేయబోతున్నట్లు కొన్ని మాధ్యమాలలో వచ్చిన వార్తలు నిజం కాదు. ఏచిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలుపలేదు. సినిమాలో నటించేందుకు అవసరమయిన సమయం లేదు. ప్రజాజీవితానికే పూర్తి సమయం కేటాయించాను. ప్రజల్లోనే ఉంటూ, జనసైనికులు అభిమానులతో కలసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న తరుణమిది. సినిమాలపై దృష్టి సారించడం లేదు.నా ఆలోచనలన్నీ ప్రజా క్షేమం కోసమే,నా తపన అంతా సమసమాజ స్థాపన కోసమే,’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.