అనంతపురం జిల్లా సొసైటీకి శాస్త్రీయ అవగాహనా జాతీయ అవార్డు

పట్టణ గ్రామీణ విద్యార్థుల మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీ చైతన్యాన్ని తీసుకురావడంలో విశేష కృషి చేసినందుకు అనంతపురం జిల్లా కదిరి కి చెందిన రూరల్ అగ్రికల్చరల్ డెవలప్ మెంట్ సొసైటీకి (రాడ్స్)కి 2018 సంవత్సరపు జాతీయ అవార్డు లభిచింది. కదిరి సమీపంలో ని తలపుల పరిసరాలలో ఈ సొసైటీ పనిచేస్తూ ఉంది.

న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఫిబ్రవరి 28 వ తేదన జరిగిన ఒక కార్యక్రమంలో భారత ప్రభుత్వం శాస్త్ర సాంకతిక శాఖ ఈ అవార్డును సొసైటీ ప్రెశిడెంట్ బండ్ల పల్లి మదన్ మోహన్ రెడ్డికి అందించింది.

కార్యక్రమంలో సైన్స్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ప్రొఫెషర్ అశుతోష్ శర్మ,భారత ప్రభుత్వం ప్రిన్పిపల్ అడ్వయిజర్ ప్రొ. కె విజయరాఘవన్, జెఎన్ యు వైస్ చాన్స్ లర్ ఫ్రొఫెసర్ జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా పట్టణ , గ్రామీణ ప్రాంత విద్యార్థులలో సైన్స్ టెక్నాలజీ మీద అవగాహన కల్పించేందుకు రార్డ్స్ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ ఎక్స్ ప్రెస్ (డిఎస్ టి సైన్స్ ఎక్స్ ప్రెస్) ను వివిధ రైల్వే స్టేషన్ల లో సందర్శించేందుకు అనంతపురం జిల్లా నుంచి వందలాది విద్యార్థులను సొంత ఖర్చులతో సొసైటీ సమీకరించింది.

బయోడైవర్సిటీ స్పెషల్, క్లైమాట్ యాక్షన్ స్పెషల్ ధీమ్ తో ఈ రైలును రూపొందించారు.

సుమారు ఐదు లక్షల మంది విద్యార్థుల లో సైన్స్ ఎక్స్ ప్రెస్,సైన్స్ ఫెయిర్స్, మేలా, సైన్స్ డిబేట్స్, చర్చలు, వ్యాసరచన పోటీలు వైజ్ఞానికి యాత్రల ద్వారా శాస్త్రీయఅవగాహన పెంపొందించేందుకు ఈసొసైటీ చేసిన కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.

శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తూన్న నూతన ధోరణులు, వాతావరణ మార్పులు సమాజం మీద కల్గించే ప్రభావం, జీవ వైవిద్యం, సేంద్రీయ వ్యవసాయం, వర్షపునీటిని సేకరించడం,అడవులను, జలవనరులను పరిరక్షించుకోవడం వంటి అంశాల పై అవగాహన కల్పించడం మీద ప్రత్యేకంగా దృష్టి నిలిపి రాడ్స్ కార్యక్రమాలు చేపడుతూ ఉంది.

ఈ కార్యక్రమాలకు చాలా ప్రశంసలందుతున్నాయి. విద్యార్థులు కూడా  పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు.

తమ సొసైటీ విద్యార్థులలో శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు, నిత్య జీవితంలో విద్యవైద్యం, పారిశుధ్యత రంగాలను మెరుగుపరచే ఉద్దేశంతో కార్యక్రమాలను ఇంకా ముమ్మరం చేస్తుందని సొసైటీ అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు.