ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియాకంటే ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తారనేది తెలిసిన విషయమే! బాబుకు ఏ ఇబ్బంది వచ్చినా తానున్నానంటూ పవన్ ముందుకు వస్తుంటారని చెబుతుంటారు. అయితే పవన్ ఎందుకో వెనకబడ్డారు అనే కామెంట్లు తాజాగా వినిపిస్తున్నాయి.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. దీంతో… చంద్రబాబుకు 118 కోట్ల అవినీతికి సంబంధించి ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన సమయంలో దక్కున్నవారంతా ఇప్పుడు మైకులముందుకు వస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఈ క్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ సమర్ధనీయం కాదని చెప్పుకొచ్చారు. భారతీయ జనతాపార్టీ ఈ అరెస్టును ఖండిస్తుందన్ని ప్రకటించారు. దీంతో… ఐటీ నొటీసులు ఇచ్చినప్పుడు ఈ ఉత్సాహం ఏమైపోయిందంటూ ఆన్ లైన్ వేదికగా సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. అయితే… ఈ ట్వీట్ ని ఆమె ఏపీ బీజేపీ చీఫ్ గా పెడుతూ… బీజేపీ ఖండిస్తుందని చెప్పడం గమనార్హం.
ఇందులో భాగంగా ట్విట్టర్ లో స్పందించిన పురందేశ్వరి… “ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది” అని ట్వీట్ చేశారు.
దీంతో… ఇంతజరిగినా పవన్ కల్యాణ్ మాత్రం స్పందించకపోవడం గమనర్హం. దీంతో… ఈ విషయంలో పురందేశ్వరి ముందుకి వచ్చి పవన్ కల్యాణ్ ని వెనక్కి నెట్టారనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా వినిపిస్తున్నాయి.
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది.
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) September 9, 2023