మీరు మారిపోయారు మేడం… పురందేశ్వరిని ఆడుకుంటున్న నెటిజ‌న్లు?

ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ దగ్గుబాటి పురందేశ్వరి వైఖరిలో మార్పు సుస్పష్టంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఆమె ఆ పదవిలోకి వచ్చినప్పటినుంచీ ఏపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆమె చేసిన విమర్శలకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పెద్దలు క్లారిటీ ఇచ్చినా కూడా కంటిన్యూ చేయడం గమనార్హం.

ఇలా కేంద్రమంత్రులు, సాటి బీజేపీ నేతలు సైతం ఏపీ ఆర్ధిక విషయాలపై పార్లమెంటు సాక్షిగా వివరణ ఇచ్చినప్పటికీ పురందేశ్వరి స్పందించడంపై వైసీపీ నేతలు ఫైరవుతున్న సంగతి తెలిసిందే. స్వయంప్రకటిత ఆర్థికవేత్తలలో ఇదే ఇబ్బంది అని బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్స్ వేశారు. ఒక పార్టీలో ఉండి మరోపార్టీ కోసం పరితపిస్తున్నారంటూ విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు.

అయినప్పటికీ పురందేశ్వరి వ్యాఖ్యల్లో మార్పు రాలేదని తెలుస్తుంది. దీంతో… బావ కళ్లల్లో ఆనందం కోసం ఆమె పరితపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మరోసారి స్పందించారు పురందేశ్వరి. ఈ సారి టీడీపీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకాన్ని ఖండించలేక, స్వాగతించలేక ఆమె పడిన అవస్థ అంతా ఇంతా కాదని తెలుస్తుంది.

అవును… “తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవి కారాదు. హిందూ ధర్మంపై నమ్మకమున్నవాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరు. ఇంతకు ముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగింది. ఈ విషయం పై గళం విప్పిన తరువాత 52 మంది నియామకం నిలిపి వేయడం జరిగింది” అని పురందేశ్వరి ట్వీట్ చేశారు.

అనంతరం… “అంటే ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తున్నదని అర్ధమవుతున్నది. కనుక టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మంపై నమ్మకమున్న వారిని మరియు హిందూ ధర్మం అనుసరించే వాళ్ళని నియమించాలి” అని పేర్కొన్నారు. దీంతో పురందేశ్వరి పై సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు.

“ఏదో చెప్పాలని మ‌న‌సులో బ‌ల‌మైన కోరిక ఉన్నప్పటికీ, చెప్పడానికి ధైర్యం చాల‌డం లేదా” అని సెటీర్లు వేస్తున్నారు. ఇదే సమయంలో… “ముందుగా బీజేపీకి న‌మ్మక‌మైన లీడ‌ర్స్‌ ను అధ్యక్షులుగా నియ‌మించాలి” అని సూచిస్తున్నారు. “తానేం చెప్పద‌లుచుకున్నారో అది బ‌య‌టికి చెప్పడానికి ధైర్యం చాల‌న‌ప్పుడు.. ఆ విష‌యం గురించి మౌనం పాటించ‌డం ఉత్తమ‌ం” అని హిత‌వు పలుకుతున్నారు.

ఇదే సమయంలో… టీటీడీ నూత‌న చైర్మన్‌ గా తిరుపతి ఎమెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి నియామ‌కం స‌రైంది కాద‌ని న‌మ్ముతున్నప్పుడు.. బ‌హిరంగంగా విమ‌ర్శించ‌డానికి పురందేశ్వరికి వ‌చ్చిన ఇబ్బంది ఏంట‌ని ప‌లువురు ప్రశ్నిస్తున్నారు. “భూమ‌న హిందుత్వం గురించి నేరుగా శంకించ‌డానికి ఆమెకు మ‌న‌స్సాక్షి అంగీక‌రించ‌లేదంటే… తాను త‌ప్పుడు ట్వీట్ చేస్తున్నాన‌న్న అప‌రాధ భావ‌న వెంటాడుతున్నట్టు క‌నిపిస్తోంది” అని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు.

మరోపక్క ఏపీ బీజేపీ బాధ్యత‌లు స్వీక‌రించిన‌ప్పటి నుంచి త‌న తండ్రి స్థాపించిన టీడీపీ కోసం మాత్రమే ప‌ని చేస్తున్నార‌నే అభిప్రాయాన్ని ఆమె క‌లిగిస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. టీడీపీపై చిన్న విమ‌ర్శ కూడా చేయ‌కుండా త‌న పార్టీ శ్రేణుల‌కి ఆ పార్టీ బీజేపీ అనుకూల‌మ‌నే సంకేతాలు పంపుతున్నారని చెబుతున్నారు. దీంతో మీరు మారిపోయారు మేడం అంటూ కామెంట్లు చేస్తున్నారు.