తెలుగుదేశం నాయకత్వం చేసిన డేటా చోరీ ఎంత ప్రమాదకరమయిందో వైసిపి నేత విజయ్ సాయి రెడ్డి వెల్లడించారు.
ప్రతి టెలిఫోన్ యూజర్ డేటానంతా అంటే ఆంధ్రలోని అరుకోట్ల జనాల డేటానంతా ‘సేవా మిత్ర’ యాప్ ద్వారా సేకరించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన గుప్పిట్లో పెట్టుకున్నాడని ఆయన ఆరోపించారు.
ఇది ఆ కుటుంబాల ప్రైవసీ మీద జరిగిన దాడి అని చెబుతూ ఇది ఆ కుటుంబ సభ్యలకే కాదు,దేశానికి కూడా ముప్పు అని, ఒక క్లిక్ తో ఈ కుటుంబ సభ్యుల పోన్ లలోని డేటానంతా ‘చంద్రబాబు అండ్ కో’ డెలీట్ చేయగలదని వైసిసి రాజ్యసభ సభ్యడు,పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి ఆందోళన కలిగించే ఒక విషయాన్ని వెల్లడించారు.
చంద్రబాబు నాయుడు *సేవా మిత్ర* అనే యాప్ ద్వారా ఈ డేటా చౌర్యం ఎలా చేశారో ఆయన వివరించారు. అంతకంటే ముఖ్యంగా ఈ డేటా వల్ల ఎంత ముప్పు ఉందో కూడా వెల్లడించారు.
రాష్ట్రంలోని ప్రజలందరి పోన్ కాల్ డీటైల్స్, ఆడపిల్లల పోన్ నెంబర్లు, ఫోటోలు, ఇతర కాల్ డేటా మొత్తం ఇపుడు చంద్రబాబు చేతిలో ఉందని, అనుకుంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలందరి కాల్ డేటాను, ఇతర డేటాను కూడా ఒక క్లిక్ తో డెలిట్ చేసి సంక్షోభం సృష్టించగదని ఆయన చెప్పారు,
అంతేకాదు,సిమ్ మార్చుకున్నా సరే, డేటాను కాపాడుకోలేరని, ఈ మొత్తం వ్యవహారం మీద పెద్ద స్థాయి లో దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
‘కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సంబంధించిన డేటాను టిడిపి,చంద్రబాబు కలసి దొంగిలించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలోని మహిళల సమాచారం టిడిపి గూండాల వద్ద ఉంది. ఆడపిల్లల ఫోన్ నెంబర్లు,ఆధార్ కార్డులు,వివాహితులా అవివాహితులా,బ్యాంక్ అకౌంట్ వివరాలు ఈ దొంగల ముఠా వద్ద ఉన్నాయి. ఈ డేటా అంతా కూడా ఆధార్ కార్డు డేటాలో ఇ- ప్రగతి అని ఏపి ప్రభుత్వం డెవలప్ చేసిన యాప్ లో ఉంది, అక్కడి నుంచి సేవా మిత్రకు ట్రాన్స్ ఫర్ అయింది, ,’ అని ఒక షాకింగ్ నిజాన్ని విజయసాయి రెడ్డి వెల్లడించారు.
సంక్షేమ పధకాలకు ఆధార్ లింక్ చేసే మిషతో ఇలా చేశారని, రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ జె సత్యన్నారాయణ ఉడాయ్ ఛైర్మన్ గా ఎంపికైన నాటి నుంచి ఆధార్ డేటాను ఇ-ప్రగతికి లింక్ చేస్తూ వచ్చారని ఆయన చెప్పారు.
‘ఫింగర్ ప్రింట్స్ , రెటీనా వంటి ఐడెండిటి మార్కర్స్ ను ఇ- ప్రగతికి ట్రాన్స్ ఫర్ చేశారు. క్యారెక్టర్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్ వేర్ ను డేటా కింద కన్వర్ట్ చేశారు. ఆధార్ డేటాను అంతా కూడా ఇ- ప్రగతికి అక్కడి నుంచి నుంచి సేవామిత్రకు బదిలీ చేశారు. ఇ-ప్రగతి ఏపి ప్రభుత్వానిది. అయితే సేవామిత్ర అనేది టిడిపికి సంబంధించింది,’ అని చెబుతూ తెలుగుదేశం పార్టీ కి ప్రజల డేటా ఎలా బదిలీ చేస్తారు, ఇది దొంగతనం కాదా,’ అని ఆయన ప్రశ్నించారు.
‘సేవామిత్ర ను అనేదానిని ఐటిగ్రిడ్ డెవలప్ చేసింది. ఐటి గ్రిడ్స్ ఓనర్ అశోక్ దాకవరం.ఆశోక్ ను పట్టుకునేందుకు తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అశోక్ సేకరించిన సమాచారం ద్వారా ఎవరు ఎక్కడెక్కెడ ఉన్నారో ట్రాక్ చేసే అవకాశం ఉంది. మీ బంధువుల స్నేహితుల ఫోన్ నెంబర్లు సేవామిత్రకు వెళ్తాయి. ఫోన్ స్టోరేజి డేటా కూడా వారి వద్దకు వెళ్లి పోతుంది.అవసరమైతే వారు డేటాను డిలీట్ కూడా వారు చేయవచ్చు,’ ఆయన చేయవచ్చు.
ఈ డేటా చౌర్యం ఎంత ప్రమాదకరమయినదంటే…
‘సిమ్ కార్డు మార్చినా కూడా ఈ పన్లన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం దేశానికి కూడా ముప్పు.మీ ఫోన్ లో మైక్రో ఫోన్ రికార్డింగ్. మీరు ఫోన్ లో మాట్లాడే మాటలు రికార్డ్ చేయవచ్చు,’ అని కూడ విజయ్ సాయిరెడ్డి చెప్పారు.
ఇద్దరు రిటైర్డు ఐఎఎస్ అధికారుల పాత్ర
ఈ సందర్బంగా ముఖ్యమంత్రికి సన్నిహితులయిన ఇద్దరు ఐఎఎస్ ల పాత్ర గురించి కూడా వెల్లడించారు. ఇందులో ఒకరు జె సత్యనారాయణ, రెండో వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం. వారి గురించి విజయసాయిరెడ్డి ఏమి చెప్పారో చూడండి.
జె సత్యనారాయణ చేసింది నేరం
‘డేటాను స్టోర్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నెమెంట్ ఇన్ ఫ్రాస్రక్చర్ ఫ్రోవైడ్ చేసింది. అలాంటి పరిస్దితి ఉన్నపుడు ఇ-ప్రగతి అనేది దానిని వాడకుండా వేరే డేటా సెంటర్ ను ఎందుకు వాాడాల్సి వచ్చింది. ఆ డేటా సెంటర్ ను సైతం చంద్రబాబు, లోకేష్ బినామిలకు ఇచ్చారు. జె సత్యన్నారాయణ అవినీతి పరుడు అని చెప్పడం లేదు.కాని చంద్రబాబుకు సహకరించేందుకు ఆధార్ డేటాను దొంగిలించారని అభియోగం మోపుతున్నాం.ఇది క్రైం,’ అని విజయ్ సాయి రెడ్డి చెప్పారు.
బాలసుబ్రహ్మణ్యం కథే వేరు…
మరొక ఐఎస్ఎస్ అధికారి బాలసుబ్రమణ్యం విషయానికి వద్దాం.ఆయన భార్యకు రెండు సంస్ధలు ఉన్నాయి. గ్రీన్ ఆర్క్ సొల్యూషన్ ,ఓటిఎస్ ఐ అనేవి వాటి పేర్లు .ఓటిఎస్ ఐ అనేది రవాణా శాఖకు సంభందించి యాప్ ను తయారుచేసింది. ఓటిఎస్ ఐ ఆర్టిఏకి ఆఫీసియల్ టెక్నాలజీ భాగస్వామి. ఓటిఎస్ ఐకి టెండర్ ఇచ్చారు. దానిలో పారదర్శకత లేదు. అభయ అనే యాప్ ను మహిళ రక్షణకు ఇంట్రడ్యూస్ చేశారు.మహిళలు బటన్ నొక్కితే అలార్మ్ చేస్తుంది. విజయవాడ,విశాఖపట్నంలలో మాత్రమే లక్ష ఆటోలకు 188 కోట్లు వెచ్చించి ఓటిఎస్ ఐకి టెండర్ ఇచ్చారు. అభయ యాప్ ద్వారా ఎంతమంది మహిళల వద్దనుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ని అత్యాచారాలను ఆపగలిగారు బయటకు వెల్లడించండి. ఆధార్ డేటా బేస్ ను ఉపయోగించుకుని జగన్ గారి నియోజకవర్గంలో(పులివెందుల) సమాచారాన్ని ఎలా సేకరించారో ఇట్టే తెలిసిపోతుంది,’ అని ఆయన వివరించారు.