Prashant Kishor-Pawan Kalyan: రాజకీయ వ్యూహకర్త, ఎన్నికల వ్యూహాల్ని రచించడంలో దిట్ట అయిన ఐ-ప్యాక్ సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్, బీహార్ కేంద్రంగా సొంత రాజకీయ కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసిందే.
గతంలో బీజేపీకి ఆయన ఎన్నికల వ్యూహాల్ని రచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే పార్టీ.. ఇలా చాలా పార్టీలు ఐ-ప్యాక్ టీమ్ సేవల్ని అందుకున్నాయి.. అధికారంలోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ సొంత కుంపటి పెట్టుకున్నాక ఐ-ప్యాక్ టీమ్.. ఏయే పార్టీలకు పని చేస్తోందన్నదానిపై ఒకింత గందరగోళం ఏర్పడింది.
జనసేనాని వైపుకు మొగ్గు చూపుతున్న ప్రశాంత్ కిశోర్..ప్రస్తుతానికైతే వైసీపీకి ప్రశాంత్ కిశోర్ టీమ్ నివేదికలు అందిస్తోంది.. ఆ పార్టీ కోసం ఆ టీమ్ పనిచేస్తూనే వుంది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఆ పార్టీ పని చేస్తోంది.. అదే సమయంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీకీ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది.
తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యేందుకు ఐ-ప్యాక్ టీమ్ ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా ప్రచారం జరుగుతోంది. జనసేన ముఖ్య నేతలతో ఐ-ప్యాక్ టీమ్ ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై ఇంతవరకు జనసేన నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
కాగా, ఇఠీవల ప్రశాంత్ కిశోర్ ప్రస్తావన వస్తే, ఒకింత పాజిటివ్‌గానే స్పందించారు పవన్ కళ్యాణ్. ‘కోడి కత్తి లాంటి డ్రామాల్ని ప్రశాంత్ కిశోర్ రచించారు కదా..’ అని ఎవరో అడిగితే, ‘వీళ్ళకి అలాంటి ఛావు తెలివితేటలు ఇంకెవరో నేర్పాలా.? అయినా, ప్రశాంత్ కిశోర్ అలాంటివాడని నేను అనుకోవడంలేదు’ అని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే.