2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ సాధించిన విజయాన్ని, ఆ విజయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పడ్డ కష్టాన్ని కూడా ఎవ్వరూ మర్చిపోరు. 151 సీట్ల విజయంతో వేరే పార్టీ నాయకుల అవసరం లేన్నంత విజయం సాధించింది. ఎన్నికల్లో వైసీపీ కొట్టిన దెబ్బకు టీడీపీ నేతలు ఇంకా కొలుకోలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఇంకా 2019 ఎన్నికల ఓటమి నుండి కొలుకోలేదు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఇతర పార్టీలను ఒడిస్తే సరిపోదని, ఆ పార్టీలను నేలమట్టం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అందుకే ఇతర పార్టీల ముఖ్యనేతలు పార్టీలోకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పార్టీ చేరికలపై వైసీపీ నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. టీడీపీ , బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నాయకులను పార్టీలోకి తీసుకుంటూ వాళ్ళకు ముఖ్యమైన పదవులను కట్టబెట్టుతుండటంతో వైసీపీ నాయకుల్లో అసహనం పెరిగిపోతుంది.
పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో, ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని టీడీపీ ప్రభుత్వంలో అనేక కేసులు ఎదుర్కొని, పార్టీకి అండగా నిలబడిన వారికి ప్రస్తుతంలో చాలా వరకు పదవులు దక్కలేదు.వీరందరికీ త్వరలోనే అంటూ హడావుడి చేయడమే తప్ప, వాటిని భర్తీ చేసే దిశగా అడుగులు వేయకపోవడంతో జగన్ పై చాలా కాలంగా అసంతృప్తితో ఉంటూ నాయకులు వస్తున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ వంటి నాయకులు వైసీపీలోకి రావడానికి ప్రయత్నిస్తుంటే గన్నవరం ఒక్కసారిగా భగ్గుమన్న విషయం తెలిసిందే. అయితే సొంత పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారని తెలిసినా కూడా ఇంకా వీటిపై యాక్షన్ తీసుకోవడం లేదని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే జగన్ మోహన్ రెడ్డి పార్టీలో నెలకొన్న అంతర్యుద్ధాని అపకపోతే రానున్న ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.