బాబు బరువు డ్రామా… భువనేశ్వరిపై పోసాని సెటైర్లు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టైనప్పటినుంచీ ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, వేస్తున్న ఎత్తులు.. ఎప్పటికప్పుడు చిత్తవుతూనే ఉంటున్నాయి! ఈ సమయంలో ఈ రోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఉందని.. సానుభూతి కార్యక్రమాలద్వారా న్యాయవ్యవస్థలను మేనేజ్ చేద్దామనుకున్నారో ఏమో తెలియదు కానీ… చంద్రబాబు బరువు టాపిక్ ఎత్తారు భువనేశ్వరి!

అవును… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబును రెండు రోజుల క్రితం ములాకత్ లో కలిసిన భువనేశ్వరి.. బయటకు వచ్చి చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని, మనోధైర్యంతో పోరాడమని చెప్పారని చెప్పుకొచ్చారు. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ… సడన్ గా చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆందోళనగా ఉందని చెప్పుకొచ్చారు. దీంతో ఆ కామెంట్లు బౌన్స్ బ్యాక్ అయ్యాయి.

వాస్తవానికి గురువారం సాయంత్రం చంద్రబాబు తనకు స్కిన్ అలర్జీలా ఉందని జైలు అధికారులకు సూచించారు. దీంతో వెంటనే రియాక్టైన అధికారులు… రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించడంతో… ఇద్దరు వైద్యులు సెంట్రల్ జైల్కి వచ్చి పరీక్షించారు. అనంతరం మందులు ఇచ్చారు. ఈ నేపథ్యలో గురువారం రాత్రి బాబు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు.

అందులో చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని.. బీపీ, హార్ట్ బీట్ అనీ బాగానే ఉన్నాయని చెబుతూ బులిటెన్ విడుదల చేశారు. ఈ సమయంలో శుక్రవారం ఉదయం ఈ విషయంపై ఒక్కసారిగా టీడీపీ ఫ్యామిలీ మెంబర్స్ ట్విట్టర్ లో బాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఇప్పుడు చంద్రబాబుకు అత్యవసర వైద్య చికిత్స అవసరమని చెప్పుకొచ్చారు.

అక్కడితో ఆగని నారా భువనేశ్వరి… చంద్రబాబు ఐదుకిలోల బరువు తగ్గారని, ఫలితంగా ఆయన కిడ్నీలకు ప్రమాదం అని అన్నారు. అయితే… చంద్రబాబు సరిగ్గా ఐదుకిలోల బరువు తగ్గారని భువనేశ్వరి ఎలా చెప్పారు.. ఆమెకు ఎలా తెలిసింది.. అనే చర్చ ఆన్ లైన్ వేదికగా జరిగింది. దీంతో… జైల్ అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా… దీనిపై జైళ్ల డీఐజీ రవికిరణ్ స్పందించారు.

ఈ సమయంలో చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గలేదని క్లారిటీ ఇచ్చిన జైల్ల శాఖ డీఐజీ… జైలుకి వచ్చాక చంద్రబాబు కిలో బరువు పెరిగారని క్లారిటీ ఇచ్చారు. జైలుకి వచ్చినప్పుడు చంద్రబాబు బరువు 66 కిలోలని, ఇప్పుడు ఆయన బరువు 67 కిలోలుగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో… బాబు ఇంటినుంచి భోజనం తెప్పించి, జైలు అధికారులు తిన్నతర్వాతే ఆయనకు పెడుతున్నామని రవికిరణ్ స్పష్టం చేశారు.

దీంతో జైల్లో ఉన్న చంద్రబాబు బరువుపై అసత్యాలు ప్రచారంచేస్తూ, సానుభూతిపొందాలని ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోయారని… బాబుకంటే భువనేశ్వరి ఆరాకులు ఎక్కువే చదివినట్లున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఈ ఇష్యూపై పోసాని స్పందించారు. తనదైన శైలిలో లాజిక్కులు లాగారు.

ఇందులో భాగంగా… చంద్రబాబు బరువు తగ్గుతున్నారంటే దానికి కారణం భువనేశ్వరే అని లాజిక్ లాగిన పోసాని… చంద్రబాబుకి మందులు, భోజనం పంపేది భువనేశ్వరినే కదా అని అడిగారు. మరి ఆమె మంచి భోజనం, మందులు పంపట్లేదా..? అంటూ పోసాని తనదైన శైలిలో ప్రశ్నించారు. కమ్మ వాళ్లని రెచ్చగొట్టడానికి భువనేశ్వరి, లోకేష్ అబద్దాలు చెబుతున్నారని.. జైల్లో చంద్రబాబు డాక్టర్లు, పోలీసుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నాడని అన్నారు.