రాజకీయాల్లోకి వచ్చిన సినిమా వాళ్లకు ఖచ్చితంగా కొన్ని సమస్యలు వస్తాయి. రీసెంట్ గా కమిడియన్ ఫృధ్వినే అందుకు నిదర్శనం. ఎందుకంటే ఓ పార్టీకి సంభందించి ప్రచారం చేస్తూంటే మరో పార్టీ కి చెందిన సపోర్టర్స్ కు కోపం వస్తుంది. అప్పుడు వాళ్లు తీసే సినిమాల్లో వాళ్లకు అవకాసం ఇవ్వరు. ముఖ్యంగా ఆర్టిస్ట్ లకు ఇది సమస్య. అయితే కొందరు వీటిని పట్టించుకోరు.
సినిమా సినిమానే..రాజకీయాలు..రాజకీయాలు రాజకీయాలే అనుకుంటారు. అలాంటి వాళ్లు తక్కువు. పోసాని ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు సపోర్టర్. అందుచేత ఓ పెద్ద నిర్మాత ఆయన్ను తమ సినిమాలోంచి తొలిగించారట. ఈ విషయం పోసాని స్వయంగా చెప్పారు.
తాజాగా పోసాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జగన్ కు మద్దతు ఇవ్వడం వల్ల సినిమా ఆఫర్స్ బాగా తగ్గాయని అన్నారు.చంద్రబాబుని, తెలుగుదేశం ని తిట్టానని కొన్ని సినిమాల నుంచి తనని తీసేశారని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఓ చిత్రంలో నన్ను ఎంపిక చేసిన తర్వాత కూడా లిస్టులో నుంచి తన పేరు తీసేశారని పోసాని ఆరోపించారు. ఆ నిర్మాత ఎవరో కాదు అశ్విని దత్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు.
ప్రస్తుతం ఉన్న నాయకుల్లో నాకు జగన్ నచ్చారు. కానీ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా టీడీపీ మద్దతు దారులే ఉన్నారు. దీనివల్ల సహజంగానే తనకు అవకాశాలు తగ్గుతాయని పోసాని అన్నారు. ఇక చిత్ర పరిశ్రమని ఏపీకి తరలించాలనే ఆలోచన సరైనది కాదని, తెలంగాణాలో టాలీవుడ్ చిత్రాలకు 45 శాతం షేర్ వస్తుందనే వాస్తవాన్ని గ్రహించాలని పోసాని తెలిపారు.