రివ్యూ : పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 – సినిమా ఎలా ఉందంటే ?

Ponniyin Selvan 1 Movie Review
 

నటినటులు: విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాల, ప్రభు, ఆర్. శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, రెహమాన్, ఆర్. పార్తిబన్ తదితరులు.

 

డైరెక్టర్: మణిరత్నం

నిర్మాతలు: మణిరత్నం, శుభస్కరన్ అల్లి రాజా

మ్యూజిక్ డైరెక్టర్ : ఏఆర్ రెహమాన్

సినిమాటోగ్రఫీ: రవి వర్మన్

‘చియాన్’ విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ కలిసి నటించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్.  పైగా  అందాల రాశి ఐశ్వర్య రాయ్, సొగసరి త్రిష, తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ హీరోయిన్స్ గా నటించిన చిత్రం. అన్నిటికీ మించి  మణిరత్నం  దర్శకత్వం వహించిన చిత్రం ఇది.  కాగా ఈ చిత్రం నేడు రిలీజ్ అయింది.  మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం
 
 
కథ : 
 
 
10వ శతాబ్దం నేపథ్యంలో చోళ రాజవంశం చుట్టూ ఈ కథ సాగుతుంది. చోళ రాజ్యపు యువరాజు ఆదిత్య (విక్రమ్), అతని తమ్ముడు అరుణ్ మోళి (జయం రవి) ఇతర రాజ్యాల పై దండయాత్ర చేస్తూ.. చేరే రాజ్యం వైపు వెళ్తారు. ఈ లోపు చోళ రాజ్యాన్ని నాశనం చేయడానికి ఐశ్వర్య రాయ్ (నందిని) కుట్రలు పన్నుతూ ఉంటుంది. ఆ కుట్రలను అడ్డుకోవడానకి తన మిత్రుడు వల్లవ్ రాయ్ (కార్తీ) ని ఆదిత్య చోళ రాజ్యపు రాజు (ప్రకాష్ రాజ్) దగ్గరకు పంపుతాడు. అనంతరం చోళ రాజ్యపు యువరాణి (త్రిష) ను కలుసుకుని శత్రువుల గురించి సమాచారం అందిస్తాడు వల్లవ్ రాయ్. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత అరుణ్ మోళి (జయం రవి) – వల్లవ్ రాయ్ (కార్తీ) ల పై ఎవరు దండయాత్ర చేశారు ?, ఈ విషయం తెలుసుకున్న ఆదిత్య ఎలా స్పందించాడు ?, చివరకు ఈ మొదటి భాగం ఎలా ముగిసింది? అనేది మిగిలిన కథ. సింపుల్ గా చెప్పుకుంటే.. కథ పెద్దది, కథనం చిన్నది అన్నట్టు సాగింది ఈ మొదటి పార్ట్.
 
Ponniyin Selvan 1 Movie Review
Ponniyin Selvan 1 Movie Review

విశ్లేషణ :  

ఈ సినిమాలో చెప్పుకోవడానికి విక్రమ్‌, కార్తి, జయం రవి లాంటి స్టార్ హీరోలు ఉన్నా.. వీరిలో ఎవ‌రూ హీరోలు కాదు. కీల‌క‌మైన పాత్ర‌ల స‌మాహారమే ఈ సినిమా. అలాగే చోళ సామ్రాజ్యం కోసం గ్రేట్ సోల్జర్స్ మధ్య జరిగిన యుద్ధమే ఈ కథనం. ఈ సినిమాలో చారిత్రక పాత్రల్లో నటించిన ప్రతి నటుడు అద్భుతంగా నటించాడు. ముందుగా విక్రమ్ విషయానికి వస్తే ఎప్పటిలాగే తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చాడు. హీరో కార్తి టైమింగ్, జయం రవి యాక్షన్ గ్రేస్ ఈ సినిమాకి అదనపు బలాలు. ముఖ్యంగా తన సహచరులు చనిపోయే సన్నివేశంలో మరియు ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్ లో అలాగే మిగిలిన క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో జయం రవి నటన కట్టి పడేస్తోంది. విక్రమ్ కూడా తీవ్రమైన భావోద్వేగాలను పండించాడు.
ఐశ్వర్య రాయ్ అద్భుతంగా నటించింది. నందిని దేవి అండ్ మందాకిని పాత్రలకు ఐశ్వర్యారాయ్ ప్రాణం పోసింది. కుండవై పిరట్టియార్ పాత్రలో కనిపించిన త్రిష కృష్ణన్ కూడా తన నటనతో అబ్బురపరిచింది. పైగా ఈ సినిమాలో త్రిష చాలా అందంగా కనిపించింది. మొత్తంగా దర్శకుడు మణిరత్నం అద్భుతమైన ఎమోషన్స్ తో హృదయాలను కదిలించేలా ప్రతి పాత్రను అత్యద్భుతంగా నడిపించి.. ఈ సినిమాకి జీవం పోశారు. పైగా ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా తన నటనతో ఉత్తమమైన నటనను కనబర్చాడు. అదేవిధంగా ఇతర కీలక పాత్రల్లో నటించిన నటీనటులతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. దర్శకుడు మణిరత్నం చరిత్రలో జరిగిన ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. మెయిన్ గా ఒక పాత్రకి మరో పాత్రకు మధ్య మంచి వైవిధ్యాన్ని చూపిస్తూ.. ప్రతి పాత్రను కథలో కలిసిపోయేలా ప్లే రాసుకోవటం ఒక్క మణిరత్నానికే చెల్లింది. ఐతే, స్క్రీన్ ప్లే ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా సాగదు. దానికి తోడు సీరియ‌స్ గా ఎమోషనల్ గా సాగే క‌థ కావడంతో బిసి ప్రేక్షకుల ఆశించే ఎలిమెంట్స్, ట్విస్టులు, సర్‌ ప్రైజ్‌లు పెద్దగా లేవు.. ఉన్నవి కూడా ఆకట్టుకునేలా అనిపించవు. కథనం బాగా నిరుత్సాహ పరిచింది.
Ponniyin Selvan 1 Movie Review
Ponniyin Selvan 1 Movie Review

 

 

 ప్లస్ పాయింట్స్ : 

విక్రమ్‌, కార్తి, జయం రవి నటన, ఐశ్వర్యారాయ్ త్రిష స్క్రీన్ ప్రెజెన్సీ,

మణిరత్నం టేకింగ్ అండ్ మేకింగ్,

భారీ యాక్షన్ ఎపిసోడ్స్,

మెయిన్ కథాంశం.

మైనస్ పాయింట్స్  :  

స్లో నేరేషన్, రొటీన్ యాక్షన్ వార్,

బోరింగ్ ట్రీట్మెంట్, డల్ గా సాగే స్క్రీన్ ప్లే,

సినిమాటిక్ టోన్ మరీ ఎక్కువ అవ్వడం,

చరిత్ర తాలూకు పాత్రల గజిబిజి.

తీర్పు  :

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో వచ్చిన ఈ ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1’లో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ అండ్ వావ్ అనిపించే వార్ సీన్స్ మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. అయితే, స్లోగా సాగే సీన్స్ తో ప్లే అక్కడక్కడ బోర్ గా అనిపిస్తోంది. కానీ సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ భారీ విజువల్స్ మరియు నటీనటుల నటన అద్భుతంగా ఉన్నాయి. కానీ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. బాగా కన్ ఫ్యూజ్డ్ గా సాగుతుంది.

Ponniyin Selvan 1
Ponniyin Selvan

              రేటింగ్ : 2.25 / 5

  బోటమ్ లైన్:  చరిత్ర మర్చిపోయిన బోరింగ్ యుద్ధం !

Ponniyin Selvan 1 Movie Review
Ponniyin Selvan 1 Movie Review