మ‌ణిర‌త్నం ఆఫ‌ర్ రిజెక్ట్ చేసిన నాని, నాగ‌చైత‌న్య‌

ద‌ర్శ‌క‌మ‌ణి మ‌ణిర‌త్నం క్రేజు గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఇదివ‌ర‌కూ చాలా మంది పెద్ద స్టార్లు కనీసం ఒక్క‌సారైనా మణిరత్నం సినిమాలో నటించాలన్న కోరికను క‌లిగి ఉండేవారు. ఒక‌ప్పుడు ఎంతో క్రేజు. కానీ ఇప్పుడ‌లా లేదు.  మ‌ణి సర్ కూడా స‌క్సెస్ ను కోల్పోయాక అంతా మారిపోయింది. ఇప్పుడు అతని సినిమాలు వాటి కంటెంట్ గురించి మాట్లాడటం లేదు. ఆ క్ర‌మంలోనే స్టార్ల‌ను పుల్ చేయ‌డం ద్వారా సినిమాని సెట్స్ కి తీసుకెళ్లాల‌నే ధోర‌ణి మ‌ణి స‌ర్ లోనూ బ‌య‌ట‌ప‌డింది.

ఇంత‌కుముందు ప‌లువురు టాలీవుడ్ స్టార్లు మ‌ణిర‌త్నం ఆఫ‌ర్ ని నిర్ధ‌య‌గా తిర‌స్క‌రించారు. మహేష్ .. రామ్ చరణ్ మ‌ణిర‌త్నం సినిమాల్లో పాత్రలు చేయడానికి ఇంతకు ముందు ఏ తీరుగా తిరస్కరించారో మనం చూశాం. తన రాబోయే చిత్రం పొన్నియన్ సెల్వన్ కాకుండా.. మణి ఇప్పుడు తమిళ హీరోలు సూర్య, సిద్ధార్థ్, అరవింద్ స్వామిలతో కలిసి `నవరస` అనే వెబ్ సిరీస్ ని తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సిరీస్ లో తెలుగు హీరోలు నాని, నాగ చైతన్య ఇతర ప్రధాన పాత్రల‌కు ఎంపిక చేయాల‌ని ఆయన భావిస్తున్నార‌ట‌. ఈ వెబ్ సిరీస్ ప్ర‌త్యేక‌త‌ ఏమిటంటే.. మ‌నిషిలోని తొమ్మిది నవరసాల‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తార‌ట‌. తొమ్మిది ఎపిసోడ్లు ఉంటాయి. మణి నిర్మాతగా కొన‌సాగుతుండగా ప్రతి ఎపిసోడ్ కి ద‌ర్శ‌కులు మార‌తార‌ట‌. మ‌రి నాని ..చైతూ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా? అంటే స‌సేమిరా అనేశార‌ట‌. ఇప్ప‌టికే వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న స‌ద‌రు స్టార్లు వెబ్ సిరీస్ ల‌లో న‌టించేందుకు ఆస‌క్తిగా లేర‌ట‌.