ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ సర్వేల సందడి నెలకొంది. ఇప్పటికే జంపింగ్ లు, చేరికలతో నెలకొన్న సందడికి తాజాగా సర్వేలు కూడా తోడయ్యాయి. ఈ సందర్భంగా విడుదలైన ఒక సర్వే తాజాగా హల్ చల్ చేస్తుంది. జగన్ పాలనపై ప్రజాభిప్రాయన్ని సేకరిస్తూ.. రాబోయే రోజుల్లో గెలుపు ఎవరిది అనే విషయాలపైనా ఈ సర్వే స్పష్టత ఇచ్చింది!
అవును… ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జగన్ పాలన, ప్రజల స్పందనపై పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా… ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించింది. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయయని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేసినా గెలుపు వైసీపీదే అని తెలిపింది. ఒకవేళ టీడీపీ, జనసేన పొత్తులతో వెళ్లినా కూడా అధికార పీఠం వైసీపీదేనని స్పష్టం చేసింది. పవన్ – చంద్రబాబు కలిసినా, విడివిడిగా వెళ్లినా… జగన్ కు పోయేదేమీ లేదని పరోక్షంగా స్పష్టం చేసింది!
ఈ సర్వే ఫలితాల ప్రకారం ఏపీలో సుమారు 56 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు తెలిపింది. అవును… వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు ఎంత శాతం మంది సంతృప్తిగా ఉన్నారు.. మరెంతమంది అసంతృప్తిగా ఉన్నారనే విషయాలను పోల్ స్ట్రాటజీ గ్రూప్ తన సర్వేలో బహిర్గతం చేసింది. వైఎస్ జగన్ పాలనపై రాష్ట్రంలో 56 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని సర్వేలో తెలిపింది.
ఇదే సమయంలో తొమ్మిది శాతం మంది జగన్ సర్కార్ అద్భుతంగా ఉందని చెప్పగా… 22శాతం మంది రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని తెలిపారని సర్వే స్పష్టం చేసింది. అదే సమయంలో 8 శాతం మంది ప్రజలు వైసీపీ పాలన అస్సలు బాగోలేదని తమ అభిప్రాయాన్ని వెల్లడించారని ఈ సంస్థ వెల్లడించింది. అదేవిధంగా… ప్రభుత్వ పని తీరుపై 3శాతం మంది ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదని పోల్ స్ట్రాటజీ గ్రూప్ స్పష్టం చేసింది.
గతకొంతకాలంగా ఏపీలో టీడీపీ, జనసేన కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు – పవన్ కల్యాణ్ ల అండర్ స్టాండింగ్ చూసిన ఎవరికైనా ఈ విషయంపై స్పష్టత ఉంటుంది. అయితే ఈ సర్వే ఫలితాల ప్రకారం… రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేసినా, వైడి విడిగా పోటీ చేసినా వైసీపీ గెలుపును ఆపలేవని తెలుస్తుంది.
అవును… టీడీపీ – జనసేన పొత్తు తో ఎన్నికల బరిలో దిగినా.. పొత్తు లేకపోయినా వైసీపీదే విజయమని సర్వే సంస్థ గణాంకాలతో సహా తేల్చింది. టీడీపీ – జనసేన పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తే వారికి 41శాతం ఓట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. ఆ సమయంలో వైసీపీకి 49శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇదే సమయంలో ఇతరులు పదిశాతం ఓట్లు సాధిస్తారని తెలిపింది.
మరోపక్క వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగాపోటీ చేసినా కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో తెలిపింది. ఈ సమయంలో వైసీపీ 56శాతం ఓట్లతో అధికారంలోకి వస్తుందని.. టీడీపీ 37శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే స్పష్టం చేసింది. ఇకపోతే జనసేన పార్టీ 7శాతం ఓట్లకే పరిమితం అవుతుందని సర్వే వెల్లడించింది. ఇదే సమయంలో ఇతరులకు ఒక్కశాతం ఓట్లు కూడా రావని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో పవన్ భయపడుతున్నట్లుగానే… టీడీపీ – జనసేనలు విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి ఓట్ల శాతం మరింత పెరుగుతుందని సర్వేలో వెల్లడైంది. అంతేకాదు టీడీపీ ఓటింగ్ శాతం తగ్గుతుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే సంస్థ తెలిపడం గమనార్హం. ప్రస్తుతం ఈ సర్వే ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతోంది. ఈ సర్వే వైసీపీ నేతలకు, కార్య్కర్తలకూ ఫుల్ బూస్ట్ అని అంటున్నారు పరిశీలకులు.