చంద్రబాబును ఏ రాజకీయ పార్టీ నమ్మడం లేదుగా.. అయ్యో పాపం అంటూ?

చంద్రబాబు నాయుడు ఎక్కడ మాట్లాడినా తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. హైదరాబాద్ అభివృద్ధికి తానే కారణమని టెక్నాలజీని వినియోగించుకోవడంలో నేనే ముందువరసలో ఉంటానని ఆయన చెబుతారనే సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు పాలనలో ఉద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పథకాల అమలు విషయంలో లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

చంద్రబాబు ఏపీలోని వైసీపీ, తెలంగాణలో టీ.ఆర్.ఎస్ మినహా దాదాపుగా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు పొత్తు పెట్టుకోవాలన్నా ఏ రాజకీయ పార్టీ పొత్తుపై ఆసక్తి చూపడం లేదనే సంగతి తెలిసిందే. జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నా బీజేపీతో ఇప్పటికే పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి మరే పార్టీ ఆసక్తి చూపడం లేదు.

ఒకప్పుడు జాతీయ రాజకీయాలలో సత్తా చాటాలని హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఏపీలో పార్టీ అధికారంలోకి వస్తే చాలని భావిస్తుండటం గమనార్హం. ఒక విధంగా టీడీపీ పరిస్థితి, చంద్రబాబు పరిస్థితి అయ్యో పాపం అనే విధంగా ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల సమయానికి టీడీపీ పరిస్థితి మెరుగుపడుతుందో లేదో చూడాల్సి ఉంది.

వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతూ ఉండటంతో టీడీపీ నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వైసీపీ ఆర్థికంగా బలంగా ఉండటంతో టీడీపీకి 2024 ఎన్నికల్లో కూడా విజయావకాశాలు కష్టమేననే కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు రాజకీయాల్లో వారసుడు ఎవరనే ప్రశ్న వినిపిస్తుండగా ఈ ప్రశ్నకు లోకేశ్ అనే సమాధానం వస్తే మాత్రం టీడీపీ నేతలు ఫీలవుతున్నారు.