అలీ…రాజకీయాలంటే సినిమా అగ్రీమెంట్ కాదండి!

ఈ మధ్య వారం రోజులుగా సోషల్ మీడియాలో సినిమా యాక్టర్ అలీ ట్రెండింగ్ అవుతున్నారు. మొదటగా వైస్సార్సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు. ఆ తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ని కలిశారు. చివరగా అశ్వినిదత్ తో పాటు ముఖ్యమంత్రి చంద్ర బాబుని కలిశారు. ఇలా వరుసబ్బెట్టి అందరిని కలవడంతో సోషల్ మీడియాలో అలీకి ఎవరికి తోచినట్టు వాళ్ళు కండువాలు కప్పి వాళ్ళ వాళ్ళ పార్టీల్లో చేర్చేసుకున్నారు.

ఈ ఊహాగానాలు ఇలా వున్న తరుణంలో అలీ ఒక టీవీ షోలో మాట్లాడుతు తనకు ప్రస్తుతం అన్ని ద్వారాలు తెరిచే వున్నాయి అని చెప్పారు. ఎవరైతే తనకి తాను కోరిన ఎమ్మెల్యే స్థానం ఇచ్చి గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తారో ఆ పార్టీలో చేరతానని చెప్పారు.

ఏ ఎమ్మెల్యే సీట్ కావాలో కూడా చెప్పారు. గుంటూరు 1 లేదా గుంటూరు 2 అవి కుదరకపోతే రాజముండ్రి లేదంటే విజయవాడ తూర్పు అయితే మాత్రమే పోటి చేస్తానని చెప్పారు. అలాగే గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధ్యక్షుడు ఓక అగ్రీమెంట్ చేసి ఇస్తేనే నమ్మి పార్టీలో చేరుతానని చెప్పారు.

అగ్రీమెంట్లు సినిమాలలో మాత్రమే చెల్లుతాయి, ఎందుకంటే సినిమా విడుదలని ఆపేస్తారు కాబట్టి. రాజకీయాలలో అలాంటివి ఏమి కుదరవని అలికి ఇంకా అర్ధం కావడం లేదు. అలాగే ఆ అగ్రీమెంట్ ఏ కోర్ట్ లో చెల్లుతుందో కూడా కనుక్కుంటే బాగుండేది.

ఇప్పటికే రాజకీయాలంటే కేవలం పదవి కోసమే అనే పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ అధికారంలోకి రాలేదంటే ఐదు సంవత్సరాలు పోరాటం చేసే ఓపిక లేక గెలిచిన నెలరోజుల్లో పార్టీ మారుతున్నారు. ఇప్పుడు గెలవకముందే మంత్రి పదవి అగ్రీమెంట్ అనే కొత్త ట్రెండ్ సృష్టిష్టున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో గెలుపు నిర్ణయమైందా ? CNX సర్వే శాస్త్రీయత ఎంత ??