వివేకాను డ్రైవరే కొట్టి చంపాడా ? ఇదేనా వివేకా రాసిన లేఖ

అలాగనే టిడిపి నేతలు, చంద్రబాబునాయుడుకు మద్దతిచ్చే మీడియా ప్రముఖంగా హైలైట్ చేస్తోంది. పైగా చనిపోయేముందు వివేకానందరెడ్డి డ్రైవర్ ప్రసాద్ గురించి రాసినట్లుగా దొరికిన ఓ లేఖకు బాగా ప్రాచుర్యం కల్పిస్తోంది. ఇంతకీ ఆ లేఖలో ఏముంది ? ఏముందంటే, డ్రైవర్ ప్రసాద్ ను తాను తెల్లవారుజామునే రమ్మని చెబితే తనను చచ్చేట్లు కొట్టాడని వివేకా చెప్పినట్లుంది. పైగా ఈ లేఖ రాయటానికి తాను చాలా కష్టపడ్డానని కూడా వివేకా లేఖలోనే రాసినట్లు ప్రచారం చేస్తున్నారు.

నిజానికి డ్రైవర్ ఎవరినైనా తెల్లవారుజామునే రమ్మంటే యజమానిని చచ్చేట్లు కొడతారా ? ఇష్టముంటే వస్తారు. లేకపోతే రాలేమని చెబుతారు. అంతేకానీ కొట్టి చంపేయరు కదా ? వైఎస్ కుటుంబమనే కాదు ఏ రాజకీయకుటుంబంలోని నేతల దగ్గర పనిచేస్తున్న డ్రైవర్లైనా బాగా నమ్మకంగానే ఉంటారు. అందుకనే ఎంత కష్టమొచ్చిన తమ డ్రైవర్లను మాత్రం మార్చరు. డ్రైవర్లు కూడా తమ యజమాని మనసు తెలుసుకునే ప్రవర్తిస్తారు.

అందుకు వివేకానందరెడ్డి డ్రైవర్ కూడా మినహాయింపేమీ కాదు. ప్రసాద్ కూడా వివేకా దగ్గర ఎన్నో సంవత్సరాలుగానే పనిచేస్తుంటారు. నమ్మకమైన డ్రైవర్లను చాలామంది తమ కుటంబసభ్యుల్లాగే చూసుకుంటారు. అందుకే డ్రైవర్లు కూడా తమ యజమానులకు అంత నమ్మకంగా, విధేయంగా ఉంటారు. డ్రైవర్ ప్రసాద్ ను కూడా వివేకా బాగా చూసుకునే వాడని వైసిపి వాళ్ళంటున్నారు.  అంత నమ్మకంగా ఉండే డ్రైవర్ ను వివేకా తెల్లవారే రమ్మంటే కొట్టి చంపేశాడంటే ఎవరూ నమ్మటం లేదు.

పైగా శరీరంపై ఏడుచోట్ల గొడ్డలితో నరికేసిన తర్వాత కూడా వివేకా తన డ్రైవర్ పై లేఖ రాసాడంటే నమ్మేట్లు లేదు. వివేకా ఒంటిపై తగిలిన దెబ్బలు చూస్తుంటే ఒకటి రెండు దెబ్బలకే పడిపోతారు. అలాంటిది ఏడు దెబ్బలు తగిలిన తర్వాత కూడా లేఖ రాసారని చంద్రబాబు మీడియా చెబుతోందంటే వినటానికే ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు కదా.  ఏమవుతుందో చూద్దాం.