Home Andhra Pradesh అలాంటి దుర్మార్గుడికి టీటీడీ పదవి ఎలా ఇస్తారు?

అలాంటి దుర్మార్గుడికి టీటీడీ పదవి ఎలా ఇస్తారు?

టీటీడీ హైదరాబాద్ సలహా మండలి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కరణ్‌రెడ్డి చేసిన పాడు పని ఇప్పుడు సంచలంగా మారింది. ఈ వ్యవహారం మీద నారా లోకేష్ జగన్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. టీటీడీ పదవులలో ఇలాంటి కామాంధులని నియమిస్తారా అంటూ ఈ కరణ్‌రెడ్డికి తెలంగాణాలో ఒక పార్టీకి, ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీకి సన్నిహితుడుగా పేరు ఉంది. ఈయన ఆయా పార్టీలకు చేసిన సేవకు మెచ్చి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవి కూడా ఇచ్చారు. అయితే సదరు వ్యక్తి పై ఇప్పుడు హైదరాబద్ లో నమోదు అయిన కేసు చూసి అందరూ అవాక్కయ్యారు. హైదరాబాద్ తార్నాక ప్రాంతానికి చెందిన ఒక యువతితో, ఆ వ్యక్తి సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం పెంచుకుని తరువాత ఆమెను నమ్మించి, మోసం చేసారని, సదరు వ్యక్తితో పాటుగా అతని భార్యా పై కూడా, బాధిత మహిళ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ ల కింద కిరణ్ రెడ్డి మీద కేసు నమోదు చేసి విచారణ అనంతరం ఆయన్ని అరెస్ట్ చేయటం జరిగింది.

Police Have Arrested Ttd Board Member Karan Reddy For That Which He Cheated On A Woman
Police have arrested ttd board member Karan Reddy for that which he cheated on a woman

అయితే అతని భార్య పైన కూడా కేసు పెట్టగా, ఆమె పరారీలో ఉందని తెలుస్తుంది. బాధిత యువతికి వైద్య పరీక్షలు కోసం హాస్పిటల్ కు తరలించారు. అరెస్ట్ చేసిన కరణ్‌రెడ్డిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇలాంటి వ్యక్తికీ తిరుమల లాంటి పవిత్రమైన చోట ఎలా చోటు ఇస్తారు అంటూ ప్రశ్నించారు. గతంలో కూడా టీటీడీలో ఉన్నత పదవిలో ఉన్న ఒక సినిమా యాక్టర్ కూడా ఇలానే దారుణమైన పనులు చేయటం చూసాం. టీటీడీ డిక్లరేషన్ ఇవ్వకుండా, భక్తుల పై లాఠీ చార్జ్ చేసి అడుగడుగునా తిరుమలను అపవిత్రం చేస్తున్నారని, ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళలను మోసం చేసే కామంధులకు, తిరుమల లాంటి చోట పదవి ఎలా కట్టబెడతారు అంటూ లోకేష్ ప్రశ్నించారు. తిరుమలలో ఇలాంటి దుర్మార్గపు అకృత్యాలు జరగటం మంచిది కాదని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు తప్పకుండా వారింమని శిక్షిస్తారని శపిస్తున్నారు.

- Advertisement -

Related Posts

గెలుపూ ఓటమి మధ్యలో నిమ్మగడ్డ ప్రయాణం-ఎక్కడికి చేరేనో !

ఏపీ హైకోర్టు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల...

త్వరలో రైతులకి తీపికబురు చెప్ప‌నున్న మోడీ సర్కార్ … ఏంటంటే ?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ అతి త్వ‌ర‌లో రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్ప‌నుందా ? అంటే.. అందుకు అవున‌నే సమాధానం వినిపిస్తోంది. ప్ర‌స్తుతం రైతులకు ఏడాదికి రూ.6వేల‌ను కిసాన్ స‌మ్మాన్ నిధి...

విడుదలకు ముందు అనూహ్యపరిణామాలు .. కరోనా బారిన పడ్డ శశికళ !

తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు ఆమె అనుచరులు. ఇప్పటికే పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లను ప్లాన్ చేశారు. కానీ ఇంతలోనే...

గవర్నర్ తో భేటీ కానున్న నిమ్మగడ్డ.. ఆ వ్యవహారమే కారణమా ?

నేడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ని కలవనున్నారు. ఆయన కలవడానికి పెద్ద కారణమే ఉందని అంటున్నారు. ముఖ్యంగా గుంటూరు చిత్తూరు, కలెక్టర్ ల వ్యవహారం...

Latest News