డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక వింత కోణంలో సాగేది. ఆయన ఎప్పుడు కూడా పార్టీకి అవిధేయుడిగా ఉండలేదు కానీ వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనకు, ఆంధ్రప్రదేశ్ పాలనకు చాలా తేడా ఉండేది. పార్టీ విధివిధానాల పరిధిలోనే ఉంటూ తనదైన శైలిలో పాలన కొనసాగించే వారు . కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న వారిని ఆయన ఇబ్బందులకు గురి చేసి పార్టీ వైపు తిప్పుకోవాలనే ఆలోచనకు రాజశేఖర్ రెడ్డి పూర్తిగా విరుద్ధంగా ఉండేవారు. కేవలం అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే ప్రజలను పార్టీ వైపు తిప్పడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇష్టపడేవారు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే అనంతపురం జిల్లాలో కలగల అనే గ్రామంలో ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రజలకు ఒక ప్రశ్న వేశారు.
ఈ గ్రామంలో మా పార్టీ అభ్యర్థి వేణుగోపాల్‌రెడ్డికి తక్కువ ఓట్లు వచ్చాయి, తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినా వృద్ధాప్య పెన్షన్లు గానీ, ఆరోగ్యశ్రీ గానీ, ఇంకా ఏ సంక్షేమ పథకాలు గానీ తెలుగుదేశం వారికి అందడం లేదు, కేవలం కాంగ్రెస్ వారికే అందాయి అనిపిస్తే తెలుగుదేశం వారు, పథకాలు అందని వారు మాకు ఓట్లు వేయకపోయినా సరే చేతులెత్తండి’అంటే ఆశ్చర్యంగా ఎవరూ చేతులెత్త లేదు. అన్నిపథకాలు లబ్ధిదారులకు చేరేటట్లు ఆయన చూశారు. ఇలా ఒక బహిరంగ సభల్లో ప్రజలను తన పాలన ఎలా ఉందని అడగాలంటే ఆ నాయకుడికి తన పాలనపై ఎంతో నమ్మకం ఉండాలి. ఆ సభలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆయనలో ప్రజలు చేతులు ఎత్తరనే ధైర్యం స్పష్టంగా కనిపిస్తుంది. బహిరంగ సభల్లో వేరే పార్టీల సానుభూతి పరులు ఉంటారని తెలిసి కూడా ఆయన ఈ ప్రశ్న ప్రజలను అడిగారంటే విమర్శలను కూడా తీసుకోవడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో అర్ధమవుతుంది. ప్రతిపక్షాల నుండి వచ్చే విమర్శలను కూడా ఆయన చాలా స్పోర్టివ్ గా తీసుకునే వారు. వారు చేస్తున్న విమర్శలపై కూడా అధ్యయనం చేసి, అందులో నిజమంటే చర్యలు తీసుకునే వారు. పాలన విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన ఒక చెరగని సంతకం, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికి ఉంటారు.