రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ.. విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు స్వాగతం చెబుతూ.. రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటూ.. ఈ రెండు రోజులూ రాజకీయాలు చేయమని చెబుతూ.. తన స్థాయిని పెంచుకున్నవారు ఒకరైతే… ఏపీకి పారిశ్రామికవేత్తలు రావాలంటేనే భయపడిపోతున్నారంటూ కథనాలు అచ్చెస్తూ.. సదస్సు ఫెయిల్ అవ్వాలని శతవిధాల ప్రయత్నాలు చేసేవారు ఇంకొకరు! ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తుంది!
రాష్ట్రం నాశనమైపోయినా పర్వాలేదు జగన్ హయాంలో ఒక్క పెట్టుబడి కూడా రాకూడదన్నదే ధ్యేయంగా పావులు కదుపుతుంది ఏపీలోని ఒక వర్గం మీడియా! ఇంతకు మించిన దౌర్భాగ్యకరమైన పని.. ఇంతకు మించిన దిగజారుడు కార్యక్రమం మరొకటి ఉంటుందా అన్న సంగతి కాసేపు పక్కనపెట్టి… విషయంలోకి వెళ్దాం!
పెట్టుబడుల ఆకర్షణే టార్గెట్ గా ఏపీ ప్రభుత్వం విశాఖ వేదికగా రెండు రోజుల అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును నిర్వహిస్తోంది. శుక్ర, శనివారాల్లో జరగబోతున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు సుమారు 20 వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు. 45 దేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు విశాఖకు వస్తున్నారు. అంతా అనుకూలంగా జరిగితే.. సుమారు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబుడుల ను రావొచ్చని ప్రభుత్వం అంచనాలేస్తుంది!
సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏ రాష్ట్రంలో అయినా రాజకీయాల సంగతి కాసేపు పక్కనపెట్టి అక్కడి మీడియా ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుంది. కానీ… ఏపీలో పరిస్థితి అది కాదు. రాష్ట్రం నాశనం అయిపోయినా పర్లేదు.. జగన్ ప్రభుత్వంలో మాత్రం పెట్టుబడులు రాకూడదు.. జగన్ సర్కార్ కి మంచి పేరు రాకూడదు.. ఫలితంగా జగన్ హయాంలో ఏపీ అభివృద్ధి కాకూడదు.. అని శతవిధాలా ప్రయత్నిస్తుంది ఒక వర్గం మీడియా!
అందులో భాగంగా… “సేఫేనా.. రావచ్చా?” అనే హెడ్డింగ్ తో పెద్ద నెటిగివ్ కథనాన్ని అచ్చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక! ఏపీకి పారిశ్రామికవేత్తలు రావాలంటేనే భయపడిపోతున్నారని.. నాలుగేళ్ళు పరిశ్రమలను తరిమేసి.. చివరి ఏడాదిలో రండి రండి.. పెట్టుబడులు పెట్టండంటే ఎవరొస్తారని పారిశ్రామికవేత్తలు అనుకుంటున్నారని.. పరిశ్రమలు పెట్టేవాళ్ళతో అధికారపార్టీ వాళ్ళు వాటాలు అడుగుతున్నారని.. దాంతో అమెరికాలోని ఒక ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్త భయపడిపోతున్నారని.. వైజాగ్ సమ్మిట్ కు రావటానికి పారిశ్రామికవేత్తలు ఇష్టపడటంలేదని.. అచ్చేసింది!
దీంతో… “ఇంతకు మించిన విషయపు రాతలు ఉంటాయా” అంటూ కామెంట్ చేస్తున్నారు వైకాపా కార్యకర్తలు! “ఏడాదంతా ఎలాగూ పనికిమాలిన రాజకీయ విమర్శలు అచ్చెసుకుంటారు కదా… ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడానా? ఎవరికి పనికొచ్చే కథనాలు ఇవన్నీ?” అంటూ ఫైరవుతున్నారు ఏపీ జనాలు. “ఇలాంటి కథనాలు అచ్చెయ్యడం వల్ల ఆ పత్రికాధినేత రాధాకృష్ణ అజ్ఞానం బయటపడటం సంగతి కాసేపు పక్కనపెడితే.. చంద్రబాబుకి పరోక్షంగా చెడ్డపేరు తెస్తున్నారు” అనే కామెంట్లు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు!