పవన్ కళ్యాణ్ కు ఓటేసినా వృథా.. అయ్యో ప్రజల్లో ఇలాంటి అభిప్రాయం ఉందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఇతర రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటాయి. సమాజంలో విప్లవాత్మక మార్పులు తెస్తానని చెప్పే పవన్ నిజ జీవితంలో ఆ విధంగా చేస్తారా? లేదా? అనే ప్రశ్నలకు లేదనే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తే పవన్ మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోరని పొలిటికల్ వర్గాల్లో అభిప్రాయం ఉండటం గమనార్హం.

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పరిస్థితి ఏంటనే ప్రశ్నకు ఆయన అభిమానులు మినహా మిగతా వాళ్లు ఓట్లు వేసే ఛాన్స్ లేదని సర్వేలలో తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు ఓటేసినా వృథా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ కు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఇతర జిల్లాలలో జనసేన నామమాత్రపు ప్రభావం కూడా చూపించే ఛాన్స్ అయితే లేదని కామెంట్ల్ వ్యక్తమవుతున్నాయి.

పదేళ్లలో పవన్ కొంతమందికి డబ్బులు పంచడం మినహా ఏం చేయలేదని ఎక్కువమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న విమర్శలను చూసి అయినా పవన్ మారాల్సిన అవసరం ఉందని అయితే పవన్ లో ఎలాంటి మార్పు రావడం లేదని జనసేన నేతలు సైతం చెబుతున్నారు. విధానాలు ఉన్న పార్టీకే ఓటేస్తామని ప్రజలు చెబుతుండటం గమనార్హం.

ప్రజలను నేరుగా కలవకుండా కొన్ని గ్రామాలకే పరిమితమై ఆ సమస్యలనే ప్రజల సమస్యలుగా పవన్ భావిస్తే నష్టపోయేది పవన్ పొలిటికల్ కెరీర్ అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల ఫలితాలను గుర్తుంచుకొని పవన్ కళ్యాణ్ మారాల్సిన అవసరం ఉందని మరి కొందరు చెబుతున్నారు.