Pawan Kalyan: రాష్ట్ర రాజకీయాలకు పవన్ గుడ్ బై… కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారా?

Pawan Kalyan: జనసేన పార్టీని స్థాపించిన పది సంవత్సరాలకు పవన్ కళ్యాణ్ టిడిపి భాజపా పొత్తులో భాగంగా గత ఎన్నికలలో పోటీ చేసి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇలా పొత్తులో భాగంగా విజయం సాధించిన ఈయనకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఇచ్చారు అలాగే పలు శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఈయన మాత్రం రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

ఇటీవల మహారాష్ట్ర ఎన్నికలలో ఈయన పెద్ద ఎత్తున సనాతన ధర్మం అంటూ ప్రచారాలను నిర్వహిస్తూ అక్కడ కూడా కూటమి ప్రభుత్వం గెలవడానికి కారణమయ్యారు. దీంతో కేంద్రం పెద్దలు ఈయనని రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా జాతీయస్థాయిలో పవన్ కళ్యాణ్ ను తమకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇలా కేంద్రమంత్రిగా ఈయనకు బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో మోడీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా సనాతన ధర్మం గురించి హిందూ మతం గురించి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మాట్లాడటంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించబోతున్నారని తెలుస్తోంది.ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు వచ్చిన జాతీయస్థాయి ఇమేజ్‌తో తమిళనాడు, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవచ్చన్న ఎన్డీఏ బాగస్వామి వ్యూహంగా కనిపిస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ కు కేంద్ర మంత్రిగా పదవి ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రి పదవి ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆ మంత్రి పదవిని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే .అయితే ఈయనకు ఏ శాఖ మంత్రిగా పదవి ఇవ్వబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.