చంద్రబాబును నమ్మి మోసపోయిన వాళ్లెందరో.. పవన్ కు అర్థం కావడం లేదా?

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ మరణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబు కారణమయ్యారని చాలామంది భావిస్తారు. 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయించుకున్నారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించేశారు.

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ కావాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు కోరుతున్నా ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ప్రశ్నకు మాత్రం చంద్రబాబు దగ్గర సరైన సమాధానం లేదు. అధికారం కోసం చంద్రబాబు చాలా సందర్భాల్లో అడ్డదారులు తొక్కారు. ప్రజల్లో విశ్వాసం లేకపోవడం వల్లే పొత్తులతో ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారు.

చంద్రబాబును నమ్మి మోసపోయిన నేతల జాబితా ఎక్కువ సంఖ్యలోనే ఉంది. అలాంటి చంద్రబాబును నమ్మి పవన్ కళ్యాణ్ ఏపీని అంధకారంలోకి నెట్టే దిశగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చినా పవన్ ను చంద్రబాబు ఏదో ఒక విధంగా మోసం చేసే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా జనసేన సొంతంగా పోటీ చేసే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హంగ్ వస్తే ఆ సమయంలో జనసేన టీడీపీకి మద్దతు ఇస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు దిశగా అడుగులు వేస్తుండటంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి