పవన్ వారాహి యాత్ర రెండోదశపై ఫుల్ క్లారిటీ!

అన్నవరంలో పూజల అనంతరం జూన్ 14న జనసేన వారాహి యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు సభతో సంచలనంగా మారిన ఈ జనసేన వారాహి యాత్ర.. జూన్ 30న భీమవరం సభతో ముగిసింది. ఆ విషయంపై నేడు జనసేన నుంచి ఆన్ లైన్ వేదికగా అధికారిక ప్రకటన వెలువడింది. ఇదే సమయంలో మలిదశ యాత్ర ఎప్పుడనే విషయాల పైనా స్పందించింది.

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ చేపట్టిన జనసేన వారాహి యాత్ర తొలిదశ పూర్తయ్యిందని జనసేన ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ తొలిదశ యాత్రలో భాగంగా తన ప్రసంగాలతో ఏపీ రాజకీయాల్లో పవన్ కాక రేపారు. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధవజమెత్తారు. ఇందులో భాగంగా కాపు నాయకులపై కూడా పవన్ ఫైరయ్యారు. ఫలితంగా సొంత సామాజికవర్గంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు!

మరోవైపు పవన్ కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. పవన్ సినిమా భ్రమల్లోంచి బయటకు రాలేదని, ఇలాంటి నేర స్వభావం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రాకూడదనే విమర్శలు తెరపైకి వచ్చాయి. ఈ సందర్బహంగా అన్ని వర్గాల నుంచీ ఇలాంటి కామెంట్లు రావడం గమనార్హం.

ఆ సంగతి అలా ఉంటే… జన్సేన మళిదశ యాత్ర ఎప్పుడు ఉంటుందనే దానిపై జనసైనికుల్లో ఆసక్తి నెలకొంది. త్వరలో చంద్రబాబు పర్యటన ఉండటంతో.. ఆ పర్య్టన అయిన తర్వాతే పవన్ వారాహి యాత్ర – 2 ఉండొచ్చని అంటున్నారు. ఈ విషయాలపై జనసేన ట్విట్టర్ లో స్పందించింది. స్పష్టంగా తేదీలు ప్రకటించకపోయినా.. షెడ్యూల్ విడుదల చేయకపోయినా… “మరికొద్ది రోజుల్లో” మొదలవ్వబోతోందని మాత్రం తెలిపింది.

అయితే పవన్ చేతిలో ఇప్పటికే సుమారు ఐదు సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా అవన్నీ షూటింగు దశల్లో ఉండి పవన్ కోసం ఎదురుచూస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆలస్యం అవ్వడంతో నిర్మాతలు తెగ టెన్షన్ పడిపోతున్నారని సమాచారం. దీంతో “బ్రో – ది అవతార్”, “హరిహర వీరమల్లు”, “ఉస్తాద్ భగత్ సింగ్”, ఓజీ – ఒరిజినల్ గ్యాంగ్ స్టర్” లతో పాటు డైరెక్టర్ సుదీర్ రెడ్డి తో ఒక సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. దీంతో… ఈ షూటింగులు పూర్తయిన తర్వాత కానీ.. మధ్యలో మరో గ్యాప్ ఇచ్చి కానీ వారాహి వాహనం బయటకు తీస్తారని అంటునారు.

కాగా… జనసేన వారాహి యాత్ర లో భాగంగా… ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ సిటీ ముమ్మిడివరం అమలాపురం పి.గన్నవరం రాజోలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బహిరంగ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే సమయం లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పాలకొల్లు భీమవరం నియోజకవర్గాల్లో పవన్ వారాహి యాత్ర కొనసాగింది.