ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైపోయింది. అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎవరి దూకుడు వారు ప్రదర్శిస్తున్నారు. ఈ సమయంలో జనసేన తీరు ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే… పవన్ రాజకీయంగా అంత అమాయకుడేమీ కాదని, బాబును సైతం బెదిరించేస్థాయిలో స్కెచ్ వేస్తున్నారనే ఒక కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్!
మహానాడు వేదికగా పవన్ కు ఝలక్ ఇవ్వాలని టీడీపీ నేతలు భావించారని తెలుస్తుంది. జనసేనకు ఏయే ప్రాంతాల్లో బలం ఉందని పవన్ చెప్పారో.. ఆయా స్థానాల్లోనే బాబు తెగ తిరుగుతున్నారు. తనకు ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో బలం ఉందని.. కృష్ణా గుంటూరుల్లో కాస్త అటు ఇటుగా ఉందని పవన్ తెలిపారు! అయితే అలా పవన్ ప్రకటించినప్పటినుంచి… రైతుల పేరు చెప్పి గోదావరి జిల్లాల్లో, యాత్రల పేరు చెప్పి ఉత్తరాంధ్రలో వరుసపెట్టి తిరిగేశారు బాబు.
అక్కడితో ఆగకుండా… తూర్పు గోదావరి జిల్లాలో కాస్త ఎక్కువ సీట్లు కావాలని అడుగుతున్న నేపథ్యంలో.. వీలైతే పవన్ కూడా ఈసారి పిఠాపురం నుంచి పోటీచేస్తారని కథనాలొస్తున్న నేపథ్యంలో… బాబు మహనాడును రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేనకంటే ఎక్కువగా టీడీపీకి బలం ఉందని నిరూపించే పనికి పూనుకున్నారు.
ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఒంటరిగా 160 సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. పైగా పొత్తుల ప్రస్థావనే తీసుకురాకుండా… మేనిఫెస్టోను కూడా ప్రకటించేశారు. దీంతో జనసేనానికి ఆగ్రహం వచ్చిందని సమాచారం. తగ్గే కొద్దీ తొక్కేస్తున్నారని భావించిన పవన్ ఈ మేరకు టీడీపీ నేతలకు ఝలక్ ఇచ్చే సంకేతాలు ఇచ్చారని సమాచారం. దీంతో… చంద్రబాబు కాస్త వెనకా ముందూ ఆలోచించి ప్రవర్తిస్తారని పవన్ భావిస్తున్నారంట.
ఇందులో భాగంగా… తన గురించి విమర్శలు వస్తున్నా టీడీపీ నుంచి స్పందన రకపోవడం, జనసేనను స్టాండ్ బై గా పెట్టుకున్నామన్నట్లుగా చంరబాబు ప్రవర్తించడం, తమ్ముళ్లకు సంకేతాలు ఇవ్వడంతో పవన్ హర్ట్ అయ్యారంట. దీంతో… చంద్రబాబు కంటే తమకు బీజేపీతోనే అనుబంధం ఎక్కువగా ఉందని, బీజేపీతో కలిసి తాము పోటీచేస్తే ఏపీలో ట్రాయాంగిల్ ఫైట్ జరుగుతుందని సంకేతాలు ఇస్తున్నారంట. ఇందులో భాగంగానే తాజాగా మోడీపై ప్రశంసల జల్లు అని తెలుస్తుంది.
ఇలా ట్రాయాంగిల్ ఫైట్ జరిగితే ముందుగా భారీగా నష్టపోయేది టీడీపీనే అని చంరబాబు & కోలకు పవన్ పరోక్షంగ హెచ్చరికలు ఇస్తున్నారంట. దీంతో… పవన్ తక్కువోడేమీ కాదు… బాబు తోక జాడిస్తే పవన్ లెక్కలు పవన్ కి ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు జనసైనికులు. మరి పవన్ ఇస్తున్న ఈ తాజా ఝులక్… బాబు ను ఏమేరకు కంట్రోల్ చేస్తుందనేది వేచి చూడాలి!