పవన్ కన్‌ఫ్యూజన్.! రాజకీయాలు అలా.! సినిమాలేమో ఇలా.!

పవన్ కళ్యాణ్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారా.? లేదంటే, కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా.? పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం గురించి ఆయన సోదరుుడు మెగాస్టార్ చిరంజీవి చాలా కాన్పిడెంట్‌గా వున్నారు. చిత్రంగా నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం చేయగల సమర్థుడంటూ కితాబులిచ్చిన సంగతి తెలిసిందే.

బ్యాక్ టు బ్యాక్ కొత్త సినిమాల్ని ప్రారంభించుకుంటూ వెళుతున్నారు పవన్ కళ్యాణ్. మరి, జనసేన పార్టీ పరిస్థితేంటి.? ఎలాంటి రాజకీయం జనసేనాని చేయబోతున్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఓ ముప్ఫయ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన అనుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్‌లో అయితే తామే అధికారంలోకి వస్తామని జనసేనాని అంటున్నారు. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. కానీ, సమయమేది.? సినిమాలు ప్రకటించుకుంటూ, ప్రారంభించుకుంటూ పోతోన్న పవన్ కళ్యాణ్, పార్టీ ఎన్నికల కార్యాచరణను ప్రకటించకపోతే ఎలా.? పవన్ రాజకీయమేంటో జనసైనికులకే అర్థం కావడంలేదు. జనసేనలో కీలక నేతలుగా వున్న నాదెండ్ల మనోహర్ కావొచ్చు, నాగబాబు కావొచ్చు.. ‘అవన్నీ జనసేనానికి వదిలెయ్యండి.. మీరైదే, జనంలో వుండండి..’ అని చెబుతున్నారు.

జనసైనికులెప్పుడూ జనంలోనే వుంటారు. నిజానికి, ఏ పార్టీ కార్యకర్తలూ వుండనంత నిజాయితీగా జనసైనికులు వుంటారు. కానీ, జనసేనాని విషయంలోనే పూర్తి గందరగోళం. సేనాని జనంలో లేకపోతే, సైనికులు వుండి మాత్రం ఏం ప్రయోజనం.?