ప్రస్తుతం పవన్ పొలిటికల్ ఫ్యూచర్ మొత్తం చంద్రబాబు చేతుల్లో పెట్టేసినట్లు తెలుస్తుంది. టీడీపీ నేతలు మనల్ని తిట్టినా… అది వారి వ్యక్తిగతమైన విమర్శగా భావించి గమ్మునుండాలే తప్ప.. టీడీపీపై ఒక్క విమర్శ చేసినా ఊరుకోను అన్నస్థాయిలో తాజాగా జనసైనికులకు వార్నింగ్ ఇచ్చారంటే.. పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు పవన్ ను నీట ముంచినా, పాల ముంచినా.. అంతా చంద్రబాబు చేతుల్లోనే ఉంది! ఆ స్థాయికి పవన్ దిగజారిపోయారు.. కాదు కాదు.. చంద్రబాబు తన రాజకీయ చాతుర్యంతో దింపారు.. ముందు ముందు ఇంకా దింపుతారు!
ప్రస్తుతం ఇలాంటి కామెంట్లే చేస్తున్నారు రాజకీయ పండితులు. అందుకు వారు చెప్పే కారణాలు కూడా సహేతుకంగానే ఉన్నాయనే కామెంట్లు వినిపించడం గమనార్హం. చంద్రబాబు నలభై పదుల రాజకీయ అనుభవం ఉన్నవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మారినట్లు ఇప్పటివరకూ ఏ నాయకుడూ మారిఉండరు. అది ఆయనను దగ్గర నుంచి చూసిన వారికి ఎవరికైనా తెలిసిన విషయమే. ఎందుకంటే… పవర్ లో ఉంటే చంద్రబాబు పాలిటిక్స్ వేరుగా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ఉంటాయి.
ఈ విషయం గ్రహించడంలో పూర్తిగా ఫెయిలయినట్లు కనిపిస్తున్న పవన్… ఇప్పటికే 2014లో ఒక అనుభవం అయినా ఇంకా మారకపోతే… ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాకపోతే తాను చేసిన తప్పులకు తానొక్కడే పోతే ఎవరికీ ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు… కాని తనను నమ్ముకున్న, తన నాయకత్వాన్ని బలపరుస్తున్న లక్షలాధిమంది అభిమానులు, జనసైనికుల భవిష్యత్తు ఏమి కావాలి?
ఇక్కడ పవన్ గ్రహించాల్సిన విషయం ఒకటే…! రెండు పార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా పవన్ మాట చంద్రబాబు వింటారని గ్యారంటీ లేదు. అవసరమైతే జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకోగల సత్తా చంద్రబాబుకు ఉంది. ఆ విషయంనలో చంద్రబాబు ఎలాంటి రెండో ఆలోచనా చేయరు. తాను ఐదేళ్లు ప్రశాంతంగా పాలన చేసుకునే విషయంలో… కాళ్లకు అడ్డంవచ్చిన వారెవరినైనా నిర్దాక్షిణ్యంగా పక్కకు తన్నిపాడేస్తారు అనడంలో పవన్ కు ఇంకా సందేహం ఎందుకో అర్ధం కాని పరిస్థితి!
పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని పదో పరకో సీట్లు గెలిచినా ఐదేళ్ల వరకూ వారంతా ఆయన వెంట ఉంటారని నమ్మకం లేదు. ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడమని జనసేన అభిమానులు, సీనియర్ నేత హరిరామ జోగయ్య వంటి వారు పదే పదే చెప్పడం వెనక కూడా ఇదే కారణం. చంద్రబాబుకు అవసరం లేకపోయినా ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఆ విషయం గ్రహించకుండా… ముఖ్యమంత్రి పదవి విషయంలో పవన్… మొహమాటాకిని పోతే… తర్వాత జరిగే పరిణామాలు అత్యంత దారుణంగా ఉంటాయి. అవి ఎంతలా అంటే… వైసీపీ నేతలు సైతం పవన్ ని చూసి జాలిపడేంతలా!
2014లో బాబు అధికారంలోకి రావడంలో పవన్ పాత్ర కచ్చితంగా ఉంది. అయితే ఈ విషయాన్ని బాబు బహిరంగంగా ఒప్పుకోలేదు సరికదా… కొంతమంది టీడీపీ నేతలతో విభిన్నమైన కామెంట్లు చేయించారు. “తన అన్ననే గెలిపించుకోలేదు కానీ.. మమ్మల్ని గెలిపించాడంట”… “అంత సీనున్నోడూ డైరెక్టుగా పోటీచేయకపోయాడా”.. వంటివి ఆ కామెంట్లలో కొన్ని ఉదాహరణలు!
ఇప్పుడేదో టీడీపీ – జనసేనల కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని కాదు. సపోజ్.. ఫర్ సపోజ్.. వస్తే…? రావాలనే కదా పవన్ తాపత్రయం! అలాంటప్పుడు ముందు పవన్ నమ్మాలి కదా! అధికారంలోకి వచ్చేశాం.. వచ్చిన తర్వాత తన పాత్ర సినిమాలు చేసుకుని, అప్పుడప్పుడూ మీటింగులు పెట్టడం కాదు కదా!
సో… పవన్ ఎంతగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది! అలా కానిపక్షంలో తనకు తాను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా మిగిలిపోయినా పర్లేదు కానీ… కాపు సామాజికవర్గ చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా, ఒక అసమర్ధుడిగా మిగిలిపోతారనడంలో సందేహం లేదని చెబుతున్నారు రాజకీయ పండింతులు! మరి పవన్ ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటారా? లేక, తనకొక తిక్కుంది.. 2014లో అది ఇంకా తీరలేదు.. 2024లో సంగతి అప్పుడు చూద్దాం… అని భావిస్తారా అన్నది వేచి చూడాలి!
