Pawan Kalyan: ఢిల్లీ టు కాకినాడ.. సడన్ గా కాకినాడ పోర్ట్ తనిఖీలు ఎందుకు!

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఈయన ఢిల్లీ వెళ్లి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కూడా కలుస్తూ పలు సమావేశాలను నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు అంతేకాకుండా కూటమి ఎంపీలకు ఈయన తాజ్ హోటల్లో ఎంతో ఘనంగా విందు కూడా ఏర్పాటు చేశారు.

ఇలా ఢిల్లీ పర్యటనలో ఎంతో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నఫలంగా విజయవాడ చేరుకోవడమే కాకుండా ఆగమేఘాల మీద కాకినాడ పోర్ట్ తనిఖీలు నిర్వహించారు. అయితే కాకినాడలో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా అవుతున్నాయి అనే విషయం తెలుసుకున్న ఈయన కాకినాడ పోర్టుకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు.

గత రెండు రోజుల క్రితం అక్రమంగా బియ్యం తరలిస్తున్నటువంటి షిప్పును సీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ అక్రమ రవాణా వెనుక వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో ఈయన అధికారులను మభ్యపెట్టి పెద్ద ఎత్తున అక్రమ రవాణాలు చేస్తూ వేలకోట్ల టర్నోవర్ చేసుకున్నారని తెలుస్తోంది.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమాలకు అడ్డుకట్టు వేయడం కోసం కాకినాడ పోర్టుపై ఓ కన్నాసి ఉంచారు ఈ క్రమంలోనే అక్రమంగా రవాణా జరుగుతున్న ఓడను సీజ్ చేశారు.స్థానికంగా కూడా తనను తలతన్నేవాడు లేడు అనే అహంకారంతో రెచ్చిపోయిన ద్వారపూడి రాజకీయానికి కూటమి పార్టీలు చెక్ పెట్టాయి. ఇక తాజగా పవన్ కాకినాడ పర్యటన వెళ్లడంతో ఈయన ఆగడాలకు చెక్ పడినట్లేనని చెప్పాలి.

ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ పరోక్షంగా ద్వారంపూడికి ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చారు ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ ఆయన అక్రమాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు.