పవన్ వాహనానికి రిజిస్ట్రేషన్ పూర్తి.. అనుకున్నది సాధించాడుగా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాహనానికి రిజిస్ట్రేషన్ కాదని ఈ వాహనం నిబంధనలను విరుద్ధంగా ఉందని పదుల సంఖ్యలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. నెగిటివ్ కామెంట్ల గురించి పవన్ సైతం స్పందించి ఘాటుగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే పవన్ వాహనానికి ఎట్టకేలకు రిజిస్ట్రేషన్ పూర్తైంది. ఏపీలో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన పవన్ తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించారు.

ఈ వాహనానికి నంబర్ కూడా వచ్చేయడంతో పవన్ పై విమర్శలు చేసిన వాళ్లకు భారీ షాక్ తగిలింది. ts13ex8384 నంబర్ తో పవన్ వాహనం రిజిస్ట్రేషన్ పూర్తైంది. తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు పవన్ వాహనానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైందని తెలిపారు. ఈ వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని అన్ని నిబంధనలను పక్కాగా పాటించడం వల్లే ఈ వాహనం రిజిస్ట్రేషన్ ను పూర్తి చేశామని ఆయన అన్నారు.

వాహనం బాడీకి సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించామని నిబంధనలను కరెక్ట్ గా పాటించడం వల్లే వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ ను కేటాయించామని ఆయన పేర్కొన్నారు. వాహనానికి రిజిస్ట్రేషన్ జరగడంపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. పవన్ వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ రావడం వైసీపీ నేతలకు భారీ షాక్ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

వైసీపీ నేతలకు ఝలక్ తగలగా వాహనం రంగు విషయంలో ఇకనైనా విమర్శలు ఆగుతాయేమో చూడాల్సి ఉంది. పదేపదే పవన్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని మరి కొందరు చెబుతున్నారు. ఈ వాహనం సహాయంతో పవన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.