పవన్ కళ్యాణ్ ప్లాన్ వేరేలా ఉందా.. బీజేపీ వెనక్కు తగ్గేలా చేశారుగా?

140330-pawankalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా బీజేపీ నేతలు ప్రకటిస్తూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. పవన్ టీడీపీకి మద్దతు ఇవ్వకూడదనే ఆలోచనతో బీజేపీ అడుగులు వేస్తోంది. చంద్రబాబు నాయుడు సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేకపోవడంతో పవన్ ను సీఎం చేయాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకెళుతోంది. బీజేపీ హైకమాండ్ కూడా పవన్ విషయంలో సీరియస్ గా ఉందని తెలుస్తోంది.

పవన్ సైతం ఏ పార్టీ నుంచి బెస్ట్ ఆఫర్ వస్తే ఆ పార్టీతో కలిసి ముందడుగులు వేయాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ ప్లానింగ్ కూడా వేరే లెవెల్ లో ఉందని కామెంట్లు వినిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. పవన్ ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీదే విజయం అని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీతో కలిసి పవన్ ముందుకెళతారా? లేక బీజేపీతో కలిసి ముందుకెళతారా? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ కు కూడా ఏపీకి సీఎం కావాలనే కోరిక అయితే ఉంది. అయితే తన మనస్సులోని కోరికను పవన్ బయటపెట్టడం లేదు. మరోవైపు ఏపీ ప్రజలు, జనసైనికులు పవన్ కళ్యాణ్ ను నమ్ముతున్నారా? అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీ.ఆర్.ఎస్ పార్టీ ఎంట్రీతో ఏపీలో పొలిటికల్ లెక్కలు మారుతున్నాయి. జగన్ కు మాత్రం 2024 ఎన్నికల టెన్షన్ మామూలుగా లేదు.

అధికారం ఐదేళ్లకే పరిమితం అవుతుందో లేక చాలా సంవత్సరాల పాటు అధికారం కొనసాగించడం సాధ్యమవుతుందో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సైతం పొత్తుల గురించి స్పష్టత ఇవ్వకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చకుండా చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అనిపించుకుంటారో ఫెయిల్యూర్ అవుతారో చూడాలి.