జోగయ్యకు జనసైనికులకు ఉమ్మడిగా ఇచ్చిపాడేసిన పవన్!

పవన్ కల్యాణ్ లెవెల్ వేరే అని, పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన అభిమానులు. కాపు సామాజికవర్గ ప్రజలు కోరుకుంటున్నారని.. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నా కూడా రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి విషయంలో రాజీ పడొద్దని, పట్టు పట్టాలని చేగొండి హరిరామజోగయ్య లాంటివారు నిత్యం పవన్ కు హితబోధ చేస్తూనే ఉంటున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత కాపు సమాజానికి ఒక ఛాన్స్ వచ్చిందని, దాని ఉపయోగించుకోవాలని పవన్ చెవిలో జోరిగలా జోగయ్య చెబుతూనే ఉన్నారు. కానీ… పవన్ వేరేది తలిచారు.

మరోపక్క పవన్ అభిమానులు, జనసైనికులు సైతం… పవన్ కనిపించగానే.. “సీఎం.. సీఎం” అని అరుస్తుంటారు. తమ కోరికను అరుపులతో వెళ్లబుచ్చుతుంటారు. అయితే… వారి అరుపులను, ఆశయాలను… ఎవరి పిచ్చి వారికి ఆనందం అని సరిపెట్టుకున్న పవన్ తాజాగా మనసు విప్పేశారు, ముసుగు తీసేశారు.. ఫలితంగా జోగయ్యకు, జనసైనికులకు ఉమ్మడిగా షాకిచ్చారు. “ఎవరి పని వారు చూసుకోండి.. నా పని నేను చూసుకుంటాను” అని క్లారిటీ ఇచ్చేశారు. పైగా… దెబ్బిపొడవడం మొదలుపెట్టారు.

అవును… గత ఎన్నికల్లో 137 స్థానాల్లో జనసేన పోటీ చేసిందని చెబుతున్న పవన్… ఆ ఎన్నికల్లో కనీసం 30 – 40 స్థానాలు కూడా గెలిపించలేకపోయారని… జనసైనికులను దెప్పి పొడిచారు. నాడు గెలిపించి ఉంటే నేడు సీఎం పోస్ట్ అడిగినా అర్ధం ఉందని.. అలా ఏమీ లేకుండా.. సీఎం పోస్ట్ అడగడం భావ్యం కాదని తన భయాన్ని బయటపెట్టారు. గతంలో నాలుగైదు సీట్లకే పరిమితమైన బీజేపీ.. నేడు కేంద్రంలో అధికారంలో లేదా..? రాజకీయాల్లో నిన్న ముఖ్యం కాదు.. రేపు ఏమిటనది, ఎలా ఉండబోతుందనేది ముఖ్యం అనే విషయం పవన్ మరిచారు.

ఫలితంగా… సీఎం సీటు లేదు ఏమీ లేదు… పొత్తులో చంద్రబాబుతో కలిసి నడుస్తాము అని క్లారిటీ ఇచ్చేశారు. అలా కానిపక్షంలో పుట్టగతులుండవనే భయాన్ని పరోక్షంగా భయటపెట్టారు. తాను సినిమాల్లోనే హీరో తప్ప రాజకీయాల్లో కాదని, ఆ విషయాన్ని జోగయ్యతో పాటు జనసైనికికులు కూడా గుర్తించాలని సీరియస్ టోన్ లో చెప్పారు పవర్ వద్దంటున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్!