ఈ పనులేంటి పవన్.. నువ్వు చేసే తప్పులు నీకైనా అర్థమవుతున్నాయా?

Pawan-Kalyan-4

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ పై విమర్శలు చేసే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా పవన్ జగన్ పార్టీ చేస్తున్న అప్పుల విషయంలో విమర్శలు చేస్తూ అప్పులతో ఆంధ్రప్రదేశ్ పేరును మ్రోగిస్తున్నందుకు జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. మీ వ్యక్తిగత సంపదను పెంచుకోవడం మరిచిపోవద్దని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడం గమనార్హం.

రాష్ట్ర సంపద ప్రగతి కుక్కలకు వెళ్లనివ్వాలని కానీ మీ ఆస్తులు, వ్యక్తిగత సంపద ఎప్పటికీ అవే స్పూర్తి అని సీఎం అప్పురత్నా అంటూ పవన్ సెటైర్లు వేశారు. జగన్ కు అవార్డ్ ఇస్తున్నట్టు ఒక ఫోటో షేర్ చేసి పవన్ కళ్యాణ్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం. అయితే జగన్ సర్కార్ మాత్రమే కొత్తగా అప్పులు చేస్తున్నట్టు పవన్ ప్రచారం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు అప్పులు తెచ్చి ఏం చేశారో చెప్పాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

జగన్ తెచ్చిన డబ్బులు ప్రజల పథకాల కోసం ఖర్చు చేశారని చంద్రబాబు తెచ్చిన డబ్బులు ఏమయ్యాయో కూడా తెలియదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సక్రమంగా అమలు చేసిన ఒక్క పథకం గురించి అయినా పవన్ చెబితే బాగుంటుందని రుణ మాఫీ పేరుతో కూడా రైతులను చంద్రబాబు మోసం చేశారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబులా మోసపూరిత హామీలు ఇచ్చి జగన్ మోసం చేయలేదని ఆ రీజన్ వల్లే జగన్ ను అభిమానించే అభిమానులు పెరుగుతున్నారని నెటిజన్లు చెబుతున్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాలను ఆపేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.