పొత్తు బేరాలు… అయిదూళ్ళు అడుగుతున్న పవన్!

ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా.. టీడీపీ – జనసేనల పొత్తు కన్ ఫాం అయినట్లే! ఆఖరికి ఈ పొత్తు ఇష్టం లేకపోతే.. జనసైనికులైనా సరే సైడైపోవాల్సిందే తప్ప.. పొత్తు మాత్రం పక్కా! ఇది పవన్ 2019 ఎన్నికల ఫలితాల తర్వాతే నిర్ణయించుకుని ఉంటారు! ఈమధ్య పబ్లిక్ గా ఓపెన్ అయిపోయారు. ఆ సంగతులు అలా ఉంటే పొత్తులో భాగంగా సీట్ల విషయంలో పవన్ పెద్ద స్కెచ్చే వేశారని తెలుస్తుంది. ఇప్పటికీ ఓట్ల శాతం అంటూ హింట్ ఇచ్చిన ఆయన… బాబు ముందు పెద్ద లిస్టే పెట్టినట్లు తెలుస్తుంది.

ఉభయ గోదావరి జిల్లాలలో 36 శాతం ఓటు బ్యాంక్ జనసేనకు ఉందని చెబుతున్నారు పవన్. అంతే కాదు అటు కృష్ణా, గుంటూరును నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకూ చూసుకుంటే ప్రతీ జిల్లాలో సగటున పాతిక శాతం ఓటు బ్యాంక్ ఉందని కూడా చెప్పుకొచ్చారు. అదే సమయంలో రాయలసీమలో కాస్త వీక్ గా ఉన్నప్పటికీ… ఏవరేజి గా చూస్తే 18 శాతం ఓటు బ్యాంక్ రాష్ట్రం మొత్తం ఉందని అంటున్నారు. దీంతో… వీటన్నింటినీ చూపించి బిగ్ నంబర్ నే పొత్తులలో భాగంగా టీడీపీ నుంచి డిమాండ్ చేయబోతున్నారంట.

జనసేన డిమాండ్ చేయబోయే సీట్ల విషయానికొస్తే… ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి ప్రధానంగా అధిక్ సీట్లు అడిగాలని పవన్ భావిస్తున్నారంట. అనంతరం ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి కూడా కాస్త పెద్ద నెంబరే అడుగుతున్నారని తెలుస్తుంది. ఇక కృష్ణా – గుంటూరు తో పాటు రాయలసీమలో కూడా కాస్త గట్టిగానే అడగనున్నారని తెలుస్తుంది. ఈ మొత్తం లెక్క చూస్తే తక్కువలో తక్కువ కనిసం 45 సీట్లవరకూ పవన్ టీడీపీ నుంచి డిమాండ్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇది చాలా పెద్ద నెంబర్ అనే అనుకోవాల్సిన పరిస్థితి. పైగా టీడీపీకి ఎక్కడ బలమైన కంచుకోటలున్నాయో… పవన్ కూడా వ్యూహాత్మకంగా ఆ ప్రాంతాల్లోనే తనకూ బలముందని లెక్కలు చెప్పారు. అంటే.. అక్కడ తాను తలచుకుంటే టీడీపీకి కూడా గండికొట్టగలననే పరోక్ష హెచ్చరిక కూడా దాగి ఉందనీ అంటున్నారు విశ్లేషకులు. పైగా ఈసారి చంద్రబాబుకు గెలుపు మ్యాండేటరీ కాబట్టి… ఆ బలహీనతను పవన్ క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక బీజేపీ కూడా ఈ పొత్తులో తోడయితే… వారికి కూడా ఒక పదిహేను సీట్లు ఉమ్మడి మిత్రుడి హోదాలో బీజేపీ కోసం పవన్ అడిగే ఛాన్స్ ఉంది. అంటే రాబోయే ఎన్నికల్లో పొత్తు కావాలనుకుంటే చంద్రబాబు… ఒక 50 – 60 సీట్లు త్యాగం చేయాలన్నమాట. అదికూడా టీడీపీ బలంగా ఉన్న ఉభయగోదావరి – ఉత్తరాంధ్ర – కృష్ణా – గుంటూరు జిల్లాలో! ఈ త్యాగానికి బాబు & కో ఫిక్సయితేనే పొత్తు పొడుస్తుంది!

దీంతో… తలలు పట్టుకుంటున్న తమ్ముళ్లు… పవన్ పొత్తు బేరాలు చూస్తుంటే… మహాభారతంలో పాండవులు అయిదు ఊళ్లు ఇవ్వమంటూ కోరినట్లుగానే ఉందని అంటున్నారట. అయిదుళ్ళూ అంటే అవన్నీ మొత్తం ఆనాటి దేశంతో సమానం!!