వైఎస్ జగన్ పరిపాలన బాగాలేదని, మహిళలకు రక్షణ లేదని, అక్రమంగా కేసులు బనాయిస్తున్నరని.. విమర్శలు చేస్తున్నారు పవన్ కల్యాణ్. రాబోయే ఎన్నికల్లో జగన్ ను గద్దె దింపడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. అందుకోసం చంద్రబాబు అధ్బుత పాలనొక్కటే ప్రత్యామ్నాయమని పవన్ నమ్ముతున్నారు. ఝనసైనికులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే… ఇది అసలు కారణం కాదని, అమరావతి భూదందాలో బాబుతోపాటు పవన్ కు పాత్ర ఉందని.. పవన్ ను కూడా బాబు బలిపశువును చేశారని కథనాలొస్తున్నాయి.
అమరావతి ముసుగులో నారా చంద్రబాబునాయుడు సాగించిన భూదందాలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అంశంపై రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. అలైన్ మెంట్ ప్రతి మెలికలోనూ బాబు & కో అవినీతి గుట్టు రట్టవుతోందనే విషయాలు తెలుస్తున్నాయి. టీడీపీ హయాంలో సీఆర్‌డీఏ చైర్మన్ గా ఉన్న చంద్రబాబు, వైస్ చైర్మన్ నారాయణ అవినీతి బాగోతాలు విస్తుపోయే రీతిలో ఉన్నాయని నివేధిక చూసినవారేవరికైనా అర్ధమవుతుంది!
చంద్రబాబు సన్నిహితుడైన లింగమనేని రమేష్ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి వెంటనే రూ.877.50 కోట్లకు… రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ ను ఖరారు చేశారంట. ఇదొక్క ఉదాహరణ సరిపోతుంది కదా… అమరావతి పేరు చెప్పి బాబు చేసిన అవినీతి బాగోతాలు, క్విడ్ ప్రోకో యవ్వారల గురించి అంటూ విమర్శలు చేస్తున్నారు వైకాపా నేతలు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… ఈ అవినీతి పాపంలో పవన్ కల్యాణ్ కు కూడా పిడికెడు వాటా ఇచ్చారు చంద్రబాబు!
అవును… జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతి పాపంలో చంద్రబాబు పిడికెడు వాటా ఇచ్చారని తెలుస్తుంది. కాజాకు సమీపంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కు సమీపంలోనే పవన్ కల్యాణ్ కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా 8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్ కు ఇవ్వడం గమనార్హం. ఇవి ప్రస్తుతానికి వచ్చిన లెక్కలు… ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయన్నది తెలియాల్సి ఉంది.
దీంతో… రాజకీయంగా తనను విడిచి పవన్ బయటకు వెళ్లకుండా చంద్రబాబు పక్కా స్కెచ్ వేశారని.. ఆవిధంగా బాబు రాజకీయ ఎత్తుగడల్లో పవన్ ఇరుక్కుపోయారని.. ఫలితంగా సొంత సామాజికవర్గాన్ని, ప్రాణానికి ప్రాణంగా నమ్మిన జనసైనికులను సైతం వంచించడానికి పవన్ సిద్ధపడాల్సి వచ్చిందని తెలుస్తుంది. దీంతో… బాబుతో ఎప్పటికైనా ఇబ్బందే అని నాడు పవన్ కు చెప్పిన విషయాలను గుర్తుచేస్తున్నారు జనసేన శ్రేయోభిలాషులు! ఇదే పవన్ – బాబు బంధానికి అసలు కారణం అని… అదంతా జగన్ పై అక్కసులా పవన్ జనసైనికులకు చెబుతున్నారని అంటున్నారు!