రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే నేతలు సక్సెస్ సాధించాలంటే ఆచితూచి వ్యవహరించాలనే సంగతి తెలిసిందే. తొందరపాటు నిర్ణయాల వల్ల రాజకీయ నేతలకు అన్ని విధాలుగా నష్టం చేకూరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే విమర్శలు చేసే విషయంలో జగన్ సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఫెయిల్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. చెప్పు చూపిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను ఎవరూ హర్షించరు.
ఒక పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ ప్రతి చిన్న విషయానికి సీరియస్ గా రియాక్ట్ కావడం వల్ల భారీ స్థాయిలో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జగన్ కూడా తాజాగా పవన్ పై విమర్శలు చేసినా ఆ విమర్శలు హుందాగా ఉన్నాయి. కొంతమంది వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని జనసేన నేతలు, టీడీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే పవన్ కంటే తామేం ఎక్కువగా మాట్లాడలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.
రాజకీయ జీవితంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విమర్శలు సాధారణమనే సంగతి తెలిసిందే. ఈ విషయం పవన్ కు తెలియనిది కాదు. పవన్ ఏ రీజన్ వల్ల మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఆయన ఆ మూడు పెళ్లిళ్లను ఏ విధంగా సమర్థించుకున్నా సాధారణ ప్రజల్లో కూడా పవన్ మూడు పెళ్లిళ్లపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. పవన్ టీడీపీతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
అయితే ఇప్పుడే పొత్తును ప్రకటించడం వల్ల పెద్దగా లాభం ఉండదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాకూడదని పవన్ కోరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏం జరగనుందో చూడాల్సి ఉంది. రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని పవన్ కోరుకుంటుండగా ఆ విధంగా ఎప్పటికి జరుగుతుందో చూడాల్సి ఉంది.