సినిమాల్లో సక్సెస్ రాజకీయాల్లో ఫెయిల్.. ఆ గుర్తింపు పవన్ కు దక్కడం లేదా?

సినిమా రంగంలో సక్సెస్ సాధించడం సులువు కాదు. ఎంతోమంది కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఈ రంగంలో సక్సెస్ సాధించలేక వెనుకడుగు వేసిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కు మాత్రం అన్నీ కలిసొచ్చి ఆయన స్టార్ హీరో అయ్యారు. రీమేక్ సినిమాలలో ఎక్కువగా నటించి సక్సెస్ రేట్ పెంచుకున్న పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో స్ట్రెయిట్ సినిమాలుగా తెరకెక్కి హిట్టైన సినిమాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

సినిమాల్లో సక్సెస్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మాత్రం ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరొవైపు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్నికల ఫలితాలలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని టీడీపీకి ఓటేసిన వాళ్లకు దక్కిన ప్రయోజనం శూన్యం అనే సంగతి తెలిసిందే.

అదే సమయంలో రాజకీయ నేతగా పవన్ కళ్యాణ్ కు సరైన గుర్తింపు దక్కడం లేదు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస లక్షణాలు పవన్ కళ్యాణ్ కు లేవని కామెంట్లు వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. పవన్, నాదెండ్ల మనోహర్ తప్ప మరో కీలక నేత లేని జనసేన పార్టీని పార్టీగా ఎలా గుర్తించాలని ప్రజలు సైతం ప్రశ్నిస్తుండటం గమనార్హం. పవన్ ను నమ్మిన ప్రజలకు ఆయన ఏం చేశారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఈరోజు చెప్పిన మాటలపై పది రోజుల తర్వాత ఆయనే నిలబడరని ఈ తరహా రాజకీయాల వల్లే జనసేన తీవ్రస్థాయిలో నష్టపోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలో రాజకీయాల్లో తేల్చుకుంటే మాత్రమే పవన్ రాజకీయాల్లో సక్సెస్ అవుతారో లేదో తేలుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.