Pawan Kalyan: పవన్ ఆరోపణలపై మౌనం పాటిస్తున్న బాబు….కాకినాడ పోర్టులో ఏం జరుగుతోంది?

Pawan Kalyan: అక్రమ రవాణాలకు అడ్డంగా మారిన కాకినాడ పోర్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నఫలంగా తనిఖీలు చేసిన సంగతి తెలిసింది. అయితే గత రెండు నెలలుగా పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లాలి అనుకుంటూ ఉండగా ఆయనకు అనుమతులు లభించలేదు. ఇక కాకినాడ పోర్టుకు వెళ్లిన షిప్ ఎక్కడానికి కూడా పలువురు అభ్యంతరం చెప్పడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.

కాకినాడ పోర్టులోకి వివిధ కారణాలతో తనను రానివ్వకుండా రెండు నెలలు అధికారులే అడ్డుకున్నారని, చివరికి పోర్టులోకి వచ్చినా షిప్ లోకి ఎక్కనివ్వకుండా సాకులు చెప్పారని పవన్ చేసిన ఆరోపణలు, కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే మౌనాన్ని ప్రశ్నించిన తీరు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.

కాకినాడ పోర్టులో రేషన్ బియ్యమే కాదు డ్రగ్స్, పేలుడు పదార్ధాలు కూడా అక్రమ రవాణా అయ్యే అవకాశం ఉందని, కసబ్ లాంటి ఉగ్రవాదులు దేశంలోకి వచ్చే ప్రమాదం ఉందని, పోర్టు భద్రతపై అమిత్ షాకు లేఖ రాస్తానని పవన్ నిన్న హుంకరించారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి స్పందిస్తుందని అందరూ భావించారు కానీ ఇప్పటివరకు కూటమి ఏ విధంగాను స్పందించలేదు.

ఇక ఈ విషయంలో పవన్ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా మౌనం పాటిస్తూ ఉండటం గమనార్హం. కాకినాడ పోర్టులో పెద్ద ఎత్తున అక్రమ బియ్యం రవాణా చేయడం అలాగే పవన్ కళ్యాణ్ ను అక్కడికి వెళ్ళకుండా అడ్డుకోవడం ఇక పవన్ కాకినాడ పర్యటన వెళ్లిన ప్రతిసారి ఎస్పీ సెలవలపై వెళ్లడం వంటివి చూస్తే అక్కడ ఏదో జరుగుతోందన్న భావన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. అదే సమయంలో కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలకు తెలియకుండా పోర్టులో ఏదో జరిగే అవకాశాలు అస్సలు లేవు. ఈ సమయంలోనే పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తే మరింత ఇబ్బంది అవుతుందన్న తరుణంలోనే బాబు మౌనంగా ఉన్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ కు తెలియకుండా అక్కడ ఇంకేదైనా జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.