భగవద్గీత – బైబిల్… మధ్యలో పవన్ పైత్యం!

రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాకత్ అయిన అనంతరం బయటకు వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్… టీడీపీతో పొత్తును అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ అధికారిక పొత్తు ప్రకటన అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ చేసిన ప్రసంగంలో స్పష్టంగా కనిపించిన పైత్యాలను ప్రముఖంగా ప్రస్థావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

సాధారణంగా రాజకీయ నాయకులు చేసే వ్యూహాలు, వేసే ఎత్తులు.. తగిలే వరకూ ప్రత్యర్థులకు అర్ధం కాకూడదని అంటుంటారు. ప్రత్యర్థికి తెలిసిపోతే అది వ్యూహం ఎలా అవుతుందని ఎదురు ప్రశ్నిస్తారు. కానీ… పవన్ కల్యాణ్ ఏ సరికొత్త వ్యూహం పన్నినట్లు అనిపించినా.. క్షణాల్లో దాని లోగుట్టు తెలిసిపోతుందని చెబుతుంటారు. ఇందులో భాగంగా తాజాగా పవన్ ప్రస్థావించిన.. కురుక్షేత్రం, దావీదు – గొలియాతు యుద్ధం!

“జులాయి” సినిమాలో బ్రహ్మానందాన్ని ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ ఒక మాట చెబుతారు. “వాడు దొంగ.. దొంగతనం చేసిన వెంటనే దొరికిపోవడం వాడి ప్రత్యేకత” అని! కాస్త అటు ఇటుగా పవన్ కూడా ఏదైన వ్యూహం ఎంచుకున్నారేమో అని అనుకునేలోపు అది బయటకు వచ్చేయడం, బరస్ట్ అయిపోవడం, తర్వాత వేస్ట్ అయిపోవడం అనేది రొటీన్ అయిపోయిందని అంటున్నారు విశ్లేషకులు.

తాజాగా అవనిగడ్డలో మైకందుకున్న పవన్ కల్యాణ్… ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఫైరయ్యారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 15 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో పవన్ సీఎం అవ్వడు ఇది శాసనం రాసిపెట్టుకోండి అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తుకు రావడం సహజం. ఆ సంగతి అలా ఉంటే… టీడిపీ – జనసేన కూటమి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తుందని పవన్ తెలిపారు.

సీఎం జగన్ రాబోయే ఎన్నికలను కురుక్షేత్రంతో పోలుస్తున్నారని.. కురుక్షేత్రమంటే కురుక్షేత్రమే అని, ఏ యుద్ధానికైనా తాము సిద్ధమే అని పవన్ ప్రకటించారు. వందకు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు గనుక వైసీపీనే కౌరవులుగా భావించాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. మరి పాండవులు అంటే ఐదుగురు ఉండాలి… జనసేనకు ఒక్కరూ లేరు అనే టాపిక్ ఇప్పుడు అప్రస్తుతం.

అయితే అక్కడితో ఆగని పవన్.. జగన్ కు కురుక్షేత్రం అనే పదం ఇష్టం లేకపోతే గనుక.. “జేమ్స్ బైబిలులో చెప్పినట్టుగా డేవిడ్ – గొలాయత్ యుద్ధం లాగా భావించడానికైనా తాను సిద్ధమని” చెప్పారు. ఇక్కడే పవన్ కి ఉన్న కులమాతాల పిచ్చి బయటకు వస్తుందని చెబుతున్నారు పరిశీలకులు. కారణం… జగనే, కురుక్షేత్రం అని ప్రకటించిన తర్వాత… ఆ పదం ఇష్టం లేకపోతే అని పవన్ ప్రస్థావించడం అజ్ఞానం అనేది ప్రజల భావనగా ఉంది.

పైగా జగన్ క్రీస్టియన్ అని ప్రజలకు గుర్తుచేయడానికి విపరీతంగా తాపత్రయపడే పవన్… తన భార్య ఒక క్రీస్టియన్ అని మాత్రం గర్వంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు! లేకపోతే… తనకు కూడా బైబిల్ గురించి బాగా తెలుసు అని ఆ ఓట్ల కోసం ఏమైనా బెమ పడుగున్నారేమో తెలియదు కానీ… “డేవిడ్ – గొలాయత్” అంటూ అపభ్రంశపు మాటలు మాట్లాడారు పవన్.

వాస్తవానికి బైబిలు లో ఉండే “గోలియత్” (తెలుగులో గొలియాతు) పాత్రను “గొలాయత్” అని పలుకుతూ భ్రష్టు పట్టించే ప్రయత్నం పవన్ చేశారని కామేంట్లు వినిపిస్తున్నాయి. కనీసం పేరు పలకడానికి కూడా చేతకాకుండా, ఆ ప్రస్తావన చెప్పాలనుకోవడం అజ్ఞానం కాక మరేమిటనేది మరో కామెంట్. ఇంగ్లీష్ లో “డెవిడ్ – గోలియత్” అనలేకపోతే… తెలుగులో “దావీదు – గొలియాతు” అని చెప్పుకున్నా సరిపోయేది కదా అని అంటున్నారు.

ఏది ఏమైనా… రాజకీయాల్లో పవన్ ఏది ముట్టుకున్నా మట్టైపోతుందనే మాటలు వినిపించడం మాత్రం మానడం లేదు! తనకు అన్నీ తెలుసు అన్నట్లుగా పవన్ చేసే ప్రసంగాలు మాత్రం ఎంతో కొంత ఫ్రీ ఎంటర్ టైన్ మెంట్ అనే విషయం కొట్టిపారేయలేనిదీ అనేది ఆయనను బాగా అభిమానించేవారి మాటగా ఉంది!