పవన్ కళ్యాణ్, నాగబాబు.! తూర్పు పడమర.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు.. ఇద్దరిపైనా ‘తూర్పు-పడమర’ అంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. సాధారణంగా తూర్పు, పడమర.. అంటే, ఒకరికొకరు చాలా దూరం అన్నమాట.! కానీ, ఇక్కడ వ్యవహారం వేరు.

2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిగో ఇక్కడి నుంచే.. అదిగో అక్కడి నుంచే.. అంటూ కుప్పలు తెప్పలుగా పుకార్లు మీడియాలో షికార్లు చేస్తున్నాయి.

2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక నుంచీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచీ అసెంబ్లీకి పోటీ చేసి, రెండు చోట్లా ఓటమి చవిచూశారు. మరోపక్క, నాగబాబు అయితే నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

నాగబాబు, పవన్ కళ్యాణ్ ఒకే జిల్లా నుంచి పోటీ చేసి ఒకరు లోక్ సభ అభ్యర్థిగా ఓటమి పాలైతే, ఇంకొకరు అసెంబ్లీ అభ్యర్థిగా ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం, రెండు వేర్వేరు జిల్లాల నుంచి అన్నదమ్ములు పోటీ చేయబోతున్నారట.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, పవన్ కళ్యాణ్ గతంలోలానే భీమవరం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. నాగబాబు గతంలో చేసిన ప్రకటన ప్రకారం, ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరు. కానీ, ఆయన మనసు మార్చుకున్నారని సమాచారమ్.

కాకినాడ నుంచి లోక్ సభ అభ్యర్థిగా నాగబాబు బరిలోకి దిగబోతున్నారన్నది తాజా ఖబర్. అనేకానేక సామాజిక వర్గ సమీకరణాల అనంతరం పవన్ కళ్యాణ్, నాగబాబు ఇలా తూర్పు – పడమర ప్లానింగ్ చేసుకున్నారట.