మస్ట్ రీడ్: పవన్ విషయంలో పునరాలోచన… తమ్ముళ్ల లెక్కలివి!

వాస్తవం చెప్పాలంటే రాబోయే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని టీడీపీ గట్టి పట్టుమీదుంది. 2024 ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రానిపక్షంలో… ఇక ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంలో పడిపోయే ప్రమాధం ఉంది. ఇక టీడీపీ కష్టంపై తాను కూడా పబ్బం గడిపేసుకోవాలని పవన్ పరితపించిపోతున్నారు! పొత్తులపై టీడీపీ నేతలు ఎవరూ నోరు మెదపకపోయినా… పార్టీ అధినేత హోదాలో ఉన్న పవన్ మాత్రం… పొత్తులు కచ్చితంగా ఉంటాయి, పొత్తులు లేకపోతే జనసేన పని అయిపోతుంది అని బహిరంగంగా ప్రకటించేస్తున్నారు. దీంతో… పవన్ ఎందుకు ఇంత టెన్షన్ పడిపోతున్నారనే విషయంపై లెక్కలు తీయడం మొదలుపెట్టారు టీడీపీ కార్యకర్తలు.

టీడీపీతో తాము పొత్తు పెట్టుకుంటామని బహిరంగంగా ప్రకటించేస్తున్నారు పవన్. పైగా టీడీపీ ఏదో తనతో పొత్తు పెట్టుకోవడానికి ఉబలాటపడుతున్నట్లు… “తమతో పొత్తుపెట్టుకోవాలంటే గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాల్సిందే” అని రివర్స్ లో డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన పవన్ తెలివితేటలు ఇవే. తనకు పొత్తు లేకపోతే ఫ్యూచర్ లేదని చెప్పుకుంటూనే… తనతో టీడీపీకి పొత్తు కావాలంటే గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాలని చెబుతున్నారు కానీ.. ఎన్ని సీట్లిస్తే గౌరప్రదంగా ఉంటుందో మాత్రం చెప్పకుండా మెలికపెడుతున్నారు.

పైగా గత ఎన్నికల్లో టీడీపీకి కొద్దో గొప్పో మద్దతుగా నిలిచిన జిల్లాల్లోనే… తనకూ బలం ఉందని సొంత లెక్కలు చెబుతున్నారు. వాటికి ప్రాతిపదిక మాత్రం బయటపెట్టడం లేదు. ఇక్కడ టీడీపీ నేతలు, పవన్ తో పొత్తును స్వాగతిస్తున్న నేతలు గమనించాల్సిన విషయం ఒకటుంది. టీడీపీకి 2019 ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లో 36 శాతం చొప్పున ఓట్లలొచ్చాయి. విచిత్రంగా… ఇప్పుడు గోదావరి జిల్లాలో తమ బలం 36శాతంగా ఉందని పవన్ చెబుతున్నారు.

ఇక కృష్ణా,గుంటూరు, విశాఖలో జనసేన బలం 25 శాతముందని చెప్పుకుంటున్నారు పవన్. కానీ… 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లాలో టీడీపీకి 37 శాతం ఓట్లు రాగా.. రాజధాని జిల్లాల్లో 41 శాతం ఓట్లొచ్చాయి. మరి అధికారికంగా టీడీపీ బలంపై లెక్కలు ఇలా ఉంటే… ఇప్పుడు కొత్తగా ఆయాప్రాంతాల్లో తమకు బలం వచ్చిందని పవన్ చెప్పుకుంటున్నారు. ఈ శాతాలన్నీ టీడీపీకి ఆల్రెడీ 2019లోనే వచ్చేశాయన్న విషయాన్ని టీడీపీ నేతలు మర్చిపోతున్నారు.

ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని, పొత్తు విషయంలో చంద్రబాబు అడుగు ముందుకు వెయ్యాలని సూచిస్తున్నారు టీడీపీ నేతలు. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైనా ఉంటే… అది టీడీపీ కే పడుతుంది కానీ… పవన్ ని నమ్మి అంత రిస్క్ ఏపీ జనాలు చేయరని చెబుతున్నారు. టీడీపీకి బలం లేని ప్రాంతాల్లోనే జనసేనకు కూడా బలం లేదు. పైగా… తమకు వైసీపీ నుంచి ఓట్లు షేర్ అయ్యాయని జనసేన నేతలు చెప్పుకొస్తున్నారు. అంటే… 2019లో టీడీపీ ఓట్ షేరింగ్ ఇప్పటికీ చెక్కుఎదరలేదనే కదా!

మరి ఈ విషయాలను మరిచిపోతున్న బాబు… టీడీపీని ఉద్దరించడానికి పవన్ పొత్తు పెట్టుకుంటున్నాడని, ఫలితంగా గౌరవప్రదమైన ఓట్లు ఇవ్వమని డిమాడం చేస్తున్నాడని భావిస్తున్నారు! కానీ వాస్తవం ఏమిటంటే…. పవన్ చెబుతున్న టీడీపీ ఓట్ల శాతం టీడీపీకి ఇప్పటికే అలానే ఉంది. పైగా ఇప్పుడు పెరిగి ఉండొచ్చు. సో… పవన్ రాజకీయంగా బ్రతకడం కోసం టీడీపీ చూరిపట్టుకుని వేళాడుతున్నాడే కానీ… టీడీపీ ని ఉద్దరించాలని కాదు. కాబట్టి… సీట్లు ఇచ్చే విషయంలో బాబు పునరాలోచించాలి. పవన్ కోసం.. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడిన నేతలను ఇబ్బంది పెట్టకూడదు. పదో పరకో సీట్లిచ్చి పవన్ ను కంట్రోల్ చెయ్యాలి… లేదంటే పొత్తు విషయంలో లైట్ తీసుకోవాలే తప్ప… సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెట్టకూడదని అంటున్నారు టీడీపీ కార్యకర్తలు.

పవన్ పెరిగిందని చెబుతున్న ఓట్ల షేరింగ్ వైసీపీ నుంచి వస్తే… ఇక టీడీపీకి వచ్చిన ఇబ్బంది ఏమిటి? గెలుపుకు అవసరమైన 40 ప్లస్ ఓట్లు టీడీపీకి ఉండనే ఉన్నాయి కదా. సో… పవన్ కు నిజంగా బలం పెరిగితే.. అది వైసీపీకి నష్టం. పైగా ఆ బలం వైసీపీ నుంచి వచ్చిందని పవన్ చెప్పుకుంటున్నారు. కాబట్టి… టీడీపీ పవన్ తో కలిసినా.. కలవక పోయినా.. చంద్రబాబుకు వచ్చే నష్టం ఏమీ లేదు. నష్టమంతా… పవన్ కే!