బ్రోకర్లు – సోదర సమానులు… పవన్ మరీ దిగజారిపోతున్నారా?

రాజకీయాల్లో దిగజారడానికి కూడా ఒక హద్దు ఉంటుంది.. అది రాజకీయాల్లో నాయకులకూ నాయకులుకూ మధ్య ఉంటే అది అంతగా కనిపించకపోవచ్చు. కానీ… ప్రజల్లోకి, ప్రభుత్వ వ్యవస్థలోకి వచ్చాక కరెక్ట్ గా స్పందించకపోతే.. నిలకడగా మాట్లాడకపోతే దిగజారిపోవడం కిందే లెక్క అని అంటుంటారు. ప్రస్తుతం పవన్ ఆ కోవలోనే ఉన్నారని చెబుతున్నారు విశ్లేషకులు.

అవును… “ఏపీలోని ప్రతీ గ్రామ వాలంటీరు.. ఈ పార్టీలో, ఈ గ్రామంలో, ఎన్ని ఇళ్లు ఉన్నాయి, వాటిలో ఎంతమంది ఉంటున్నారు అనే విషయాలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలను వీళ్లు టార్గెట్ చేసి, ఆ ఇన్ ఫర్మేషన్ కొంతమంది సంఘవిద్రోహ శక్తులకు ఇస్తే.. వాళ్లు వీరిని కిడ్నాప్ చేయడం కానీ, ట్రాప్ చేయడం కానీ చేస్తున్నారు. ఇలా ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది.. దీనిలో చాలా మంది వైసీపీ పెద్దల హస్తం ఉంది” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అనంతరం అన్నివర్గాల నుంచీ పవన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న తరుణంలో… వెనక్కి తగ్గినట్లు కనిపించిన పవన్… తాను అలా అనలేదని… వాలంటీర్లు అందరినీ అనలేదని, కొంతమందిని అన్నట్లుగా చెబుతూ, కుల్లిన మామిడిపండ్ల కథ ఒకటి ఎత్తుకున్నారు! దీంతో ఆ మాత్రం భయం ఉండాలిలే అని వాలంటీర్లు ఎద్దేవా చేసినట్లు కథనాలొచ్చాయి!

ఈ సమయంలో ఆ మాటలు కవర్ చేయలేక, డ్యామేజ్ కంట్రోల్ కు దిగిన నాదెండ్ల మనోహర్… వాలంటీర్ల క్షేమం కోసమే పవన్ అలా అన్నారని చెబుతూ… అర్ధం పర్ధం లేని ఒక ప్రయత్నం చేశారు. కాకపోతే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిందనే విషయాన్ని గ్రహించకున్నారు. ఫలితంగ… ఇప్పుడు తలలు పట్టుకున్నారని సమాచారం! ఇదే క్రమంలో… వాలంటీర్ల నిరసనలు తీవ్రమవుతున్నాయి! పలు చోట్ల పవన్ పై పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి.

అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి… మరోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దన్న రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు! మరోపక్క మహిళా కమిషన్ 10రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది. మరోపక్క చంద్రబాబు కూడా కవర్ చేయలేకపోతున్నాడు. ఎల్లో మీడియా పవన్ కోసం బరితెగించి వాలంటీర్లపై కామెంట్లు చేయలేకపోతుంది. దీత్మో… గుండెల నిండా ధైర్యం ఉందని చెప్పుకునే పవన్… భయపడినట్లు అంటున్నారు!

దీంతో… ఆదివారం వాలంటీర్లను బ్రోకర్లుగా చిత్రీకరించిన పవన్.. బుధవారానికి వచ్చేసరికి వాలంటీర్లలోని మహిళలు తనకు సోదరీమణులు అని చెప్పుకొచ్చారు. అవును… వాలంటీర్లను ముందుగా బ్రోకర్లుగా చిత్రీకరించిన పవన్.. ఇప్పుడు వారంతా నా సోదరణీమణులతో సమానం అంటున్నారు. దీంతో.. పవన్ ఇంట్లో తన అక్కలను ముద్దుగా బ్రోకర్లు అని పిలుచుకుంటాడేమో అనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు!! ఈ స్థాయిలో పవన్ పై తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయని తెలుస్తుంది.

ఇదే సమయంలో మరోసారి మైకందుకున్న పవన్… ఎలాంటి జీతం ఆశించకుండా పని చేసేవాళ్లు వాలంటీర్లు అని.. డబ్బులు తీసుకుని పని చేసే వారు వాలంటీర్లు ఎలా అవుతారని ప్రశ్నించారు. వాలంటీర్లు తనకు సోదర సమానులని అన్నారు. వాలంటీర్లు ఎలా పని చేయాలో మాత్రమే తాను చెబుతున్నానని అన్నారు. దీంతో… బెదురు పట్టుకున్నట్లుందనే కామెంట్లు వినిపిస్తున్నాయని సమాచారం!

అయితే ప్రజాసేవ చేయాలని రాజకీయ్యాల్లోకి వస్తానంటున్న పవన్… రేపు ఎమ్మెల్యే అయితే జీతం తీసుకోరా? తీసుకుంటే అది “సేవ” ఎలా అవుతుంది? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు!!