డీ మార్ట్ లో పవన్ ఫ్యాన్స్ చోరీ..దీని వెనక అసలు నిజం బయటకి..!

రేపు సెప్టెంబర్ 2న టాలీవుడ్ ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున జల్సా మరియు తమ్ముడు సినిమాలు రీ రిలీజ్ లతో పెద్ద హంగామానే నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాల సందడి ఏమో కానీ ఈ అంశంలో కూడా పవన్ పై అయితే రాజకీయ పరమైన విమర్శలు తప్పలేదు. పవన్ ఫ్యాన్స్ అలాగే జనసేన యూత్ గుంటూరు లోని ఓ డీ మార్ట్ దగ్గర పెద్ద ఎత్తున గోల చేస్తూ సందట్లో సడేమియా అన్నట్టుగా లోపల దొంగతనాలు చేసి వెళ్లిపోయారని దీనితో డీ మార్ట్ వాళ్ళు భారీగా నష్టపోయారని అంటూ పలు విమర్శలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీనితో ఈ అంశంపై పవన్ పార్టీ ప్రతినిధులు ప్రాంతీయంగా ఉన్న వారు వెంటనే అక్కడి ఘటనపై ఆరా తీయగా అసలు నిజం బయటకి వచ్చింది. అక్కడ అసలు ఎలాంటి చోరీ జరగలేదు అని స్వయంగా ఆ డీ మార్ట్ కె వెళ్లి వీడియో తీసి మరీ చెబుతున్నారు.

కావాలనే కొందరు తమ పార్టీపై ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ఈ విషయంలో ఎవరినీ వదిలేది లేదని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అని తెలిపారు. దీనితో ఈ ప్రచారం పై ఒక ముగింపు బయటకి వచ్చింది.