బ్రోకర్ కృష్ణ అంటూ ఫైర్ అవుతున్న జనసైనికులు.. ఏమైందంటే?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోయినా పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా తగ్గడం లేదు. రాజకీయాల్లో పవన్ ఇప్పుడు కాకపోయిన ఎప్పుడో ఒకసారి సంచలనాలు సృష్టిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి రాధాకృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ పవన్ కు వెయ్యి రూ.కోట్లు ఆఫర్ చేశారని రాధాకృష్ణ జోరుగా ప్రచారం చేశారు.

అయితే ఈ ఆఫర్ గురించి పవన్ నోరు మెదపకపోయినా జన సైనికులు మాత్రం సీరియస్ అవుతున్నారు. బ్రోకర్ కృష్ణ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ను నెటిజన్లు ట్రెండింగ్ లోకి తెస్తున్నారు. ఏబీఎన్ బ్రోకర్ కృష్ణ అంటూ ఈ హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయాలని కేసీఆర్ సూచించారని ఆ వార్తల సారాంశం. పవన్ నిజంగానే ప్యాకేజీ తీసుకుని రాజకీయాలు చేస్తున్నారనే అర్థం వచ్చేలా రాధాకృష్ణ ఈ కామెంట్ చేశారు.

గతంలో రాధాకృష్ణ ప్రజారాజ్యం పార్టీ గురించి విషం కక్కిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సూచనల ప్రకారమే రాధాకృష్ణ ఈ తరహా వార్తలను ప్రచారంలోకి తెస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందిస్తే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు. ఈ విమర్శల గురించి స్పందించని పక్షంలో పోయేది పవన్ కళ్యాణ్ పరువేననే సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ తన గురించి వైసీపీ నేతలు చేసే కామెంట్లకు వెంటనే స్పందిస్తారని ఇతరులు చేసే కామెంట్ల విషయంలో మాత్రం అస్సలు రియాక్ట్ కావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.