వివాదంలో నారాయణ: చంపి సూసైడ్ అంటున్నారు -పేరెంట్స్ (వీడియోలు)

నారాయణ కాలేజీలో మరో దారుణం జరిగింది. అనూహ్య రీతిలో ఒక విద్యార్థి మరణించాడు. అతని మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి ఘటన మొదటిసారి కాదు నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన అన్ని కాలేజీలలో చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

ఆ కాలేజీలో చదువుకుంటే మంచి ర్యాంకులు సాధిస్తారు, ప్రయోజకులు అవుతారు అని ఆశపడి నారాయణ కాలేజీలో తమ పిల్లల్ని చేర్పిస్తున్నారు పేరెంట్స్. కానీ అదొక జైలు అని, అక్కడ చదువు నరకంలా ఉందని, ఆ టార్చర్ తట్టుకోలేమంటూ ఆత్మహత్యలు చేసుకుని అసువులు బాస్తున్నారు విద్యార్థులు.

Narayana college

గొప్పగా చదివిస్తారు అని ఆశతో ఆ కళాశాలల్లో చదివిస్తున్నారు కానీ అనుక్షణం తల్లిదండ్రులు కూడా ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో అనే భయం వారికి కూడా లోలోపల ఉంటుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నారాయణ కాలేజీలో ఒక విద్యార్థి ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే అతని మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు, ఘటనకు సంబంధించిన వీడియోలతో సహా కింద ఉన్నాయి చదవండి.

విజయవాడ నిడమానూరు జాతీయ రహదారి పక్కన ఉన్న నారాయణ కళాశాలలో తనీష్ చౌదరి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం తెల్లవారుఝామున హాస్టల్ రూములో ఉరి వేసుకుని కనిపించాడు. తనీష్ ని కామినేని ఆసుపత్రికి తరలించారు కాలేజీ బృందం. 6:40 నిమిషాల సమయంలో మీ అబ్బాయికి ఆరోగ్యం బాలేదు, కామినేని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని తనీష్ తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పారు కాలేజీ యాజమాన్యం వారు.

హాస్పిటల్ కి వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులకి తమ కుమారుడు మార్చురీలో శవంలా కనిపించాడు. అక్కడ సీఐ మాత్రమే ఉన్నాడని, కాలేజీకి సంబంధిన స్టాఫ్ ఎవరూ లేరని ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు కాలేజీకి దగ్గరికి వెళ్లారు. సిబ్బంది లోపలి అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐ ఉమా మహేశ్వరరావు జోక్యం చేసుకుని వారిని లోపలి పంపించారు. తనీష్ ఎలా చనిపోయాడు అనే విషయంపై ఆరా తీశారు కుటుంబసభ్యులు.

narayana college student suicide

తనీష్ బంధువు మీడియాతో మాట్లాడుతూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బాబుని కాలేజీ యాజమాన్యమే చంపేసి ఉరేశారు అని ఆయన ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు అలానే ఉంచకుండా హాస్పిటల్ కి ఎందుకు తీసుకువెళ్లారు అంటూ ప్రశ్నిస్తున్నారు. తోటి విద్యార్థుల్ని అడిగితే రాత్రి 10 గంటలకు కనిపించాడు అని చెప్తున్నారు. మరొకరు పొద్దున్న 5 గంటలకు చూసాము అని చెబుతున్నారు. ఈ మధ్యలో బాబు ఏమైనట్టు అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై మాకేమి తెలియదు అంటున్నారు వార్డెన్స్ నల్లంటి వీరబాబు, దేశావత్తు వరప్రసాద్. నల్లంటి వీరబాబు వేధింపులకు గురి చేస్తున్నాడని, తాను ఉంటున్న 215 రూమ్ మార్చమని మా బాబు ప్రిన్సిపాల్ కి తెలిపాడు. కాలేజీ వాళ్లే చంపేసి మా బాబుది ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బాబుకి ఎప్పుడో ఒకేసారి ఆస్తమా వస్తుంది. దానికి ఆత్మహత్యకి సంబంధం లేదు అని వాపోతున్నారు. మా బిడ్డని అన్యాయంగా చంపేశారంటూ కాలేజీ వద్ద రోదిస్తున్నారు విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు.

Narayana college student suicide

ఈ ఘటనపై పోలీసు అధికారి మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్నాక అక్కడే ఉంచకుండా హాస్పిటల్ కి ఎందుకు తీసుకెళ్లారు అని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. దీని గురించి ఏమంటారు అనగా లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా ఊపిరి ఉందేమో అని హాస్పిటల్ కి తీసుకెళ్లి ఉండవచ్చు అన్నారు. సూసైడ్ నోట్ ఏమి రాయలేదని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపడతామని అన్నారు.

narayana college student suicide

 

ఇది కూడా చదవండి, వినండి

 

తెలంగాణా గల్ఫ్ పాట