జగన్ పై స్వరం పెంచిన మంత్రి ఆది నారాయణ రెడ్డి

ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి జగన్ పై తన స్వరాన్ని పెంచారు. కంచరపాలెంలో జనసంద్రాన్ని చూడగానే గెలుపు సులువు కాదన్నారు. అలా జనాలను చూసి గెలవాలంటే ఎంతో మంది నాయకులు గెలిచి ఉండేవారన్నారు. 2009లో జమ్మల మడుగులో చిరంజీవి 41000 వేల మందితో సభ పెడితే ఆ ఎన్నికల్లో 4000 వేల ఓట్లు కూడా రాలేదని విమర్శించారు. విజయమ్మ విశాఖలో 50000 వేల మందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసినా 91000 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందన్నారు. 500 మంది తో నామినేషన్ వేసిన హరిబాబు 91000 వేల ఓట్ల తేడాతో గెలిచారన్నారు.

విజయమ్మ తన వల్లే ఓడిపోయిందని ఒప్పుకుంటే జగన్ వల్లే తాము గెలిచామని ఒప్పుకుంటామన్నారు. వైఎస్ సీఎం కావడానికి తాము కృషి చేశామని ఆ విషయాన్ని మర్చపోవద్దని  ఆదినారాయణ రెడ్డి జగన్ కు సూచించారు. ఎవరి చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసునని, వైసిపి పెట్టిన నాటి చరిత్ర చెబితే పారిపోతావని జగన్ ను హెచ్చరించారు. తన తండ్రి  ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు జగన్ ఇంకా పుట్టలేదని ఆది నారాయణ అన్నారు. తాను ఎమ్మెల్యేగా నీ దగ్గరకు వచ్చానని ఆ రోజు ఎమ్మెల్యేల ఫిరాయింపులు గుర్తు రాలేదా అన్నారు. కొద్ది రోజుల క్రితమే జగన్ మంత్రులంతా ఊరకుక్కులు అని విమర్శులు చేయడంతో ఆది నారాయణ రెడ్డి జగన్ ను ఊర పంది అని విమర్శలు చేశారు.

మంత్రి ఆది నారాయణ వ్యాఖ్యలతో రాజకీయం వేడెక్కింది. జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో ప్రతిపక్ష నేతలు కూడా అంతే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నేతల పరస్పర విమర్శలతో రాజకీయం రణరంగం వేడెక్కుతోంది.  జగన్ సభలకు వస్తున్న జనాన్ని చూసి టిడిపికి గుబుళు ప్రారంభమైందని వైసిపి నేతలంటున్నారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం చేసినప్పటి నుంచి జనం తండోపతండాలుగా హాజరవుతున్నారు. జగన్  సభలకు వచ్చే జనం ఎలా తరలివస్తున్నారో అన్న విషయం టిడిపికి కూడా అంతుపట్టడం లేదు. మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలతో టిడిపి నేతలకు భయం పుట్టిందన్న వ్యాఖ్యలకు బలం చేకూరిందని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు.