ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో బాధ్యతలు తీసుకునే రోజు దగ్గర పడుతున్న నేపధ్యంలో వాస్తు మార్పులు చేస్తున్నారు. సచివాలయంలోని మొదటి అంతస్తులో సిఎం చాంబర్ కు వెళ్ళే ఒక ద్వారాన్ని మూసేశారు. అలాగే చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో కూడా మార్పులు చేస్తున్నారు.
వాస్తుకు అనుగుణంగా చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం చాంబర్ లో కూడా ఆగ్నేయ మూలలో మార్పులు చేస్తున్నారు. ఈ చాబర్ వాస్తుకు పూర్తిగా విరుద్ధంగా ఉందని చెప్పటంతో ప్రస్తుత చాంబర్ పక్కనే వాస్తు ప్రకారం చూసి కొత్తది కడుతున్నారు.
ఈమధ్యనే జరిగిన ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. 175 అసెంబ్లీ స్ధానాల్లో ఏకంగా 151 స్ధానాలను గెలుచుకున్నది. సో ఈ అఖండ విజయపరంపర మరింతగా సాగేందుకు వాస్తు పండితులు సచివాలయంలో కొన్ని మార్పులు సూచించారు. అందుకు అనుగుణంగానే మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి.