ప్రజలు కాంగ్రెస్ ను స్వాగతిస్తున్నారు ప్రతిచోటా…

(గణపతి)

ఆంధప్రదేశ్ లో ప్రజలు  కాంగ్రెస్ ను మళ్లీ అక్కున చేర్చుకుంటారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఎం ఎం పల్లంరాజు అంటున్నారు. ‘‘2014 నాటి పిరిస్థితులు వేరు. 2019 వేరు. 2014లో  ఏం తప్పు జరిగిందోె సర్వత్రా ప్రజలు గమనించారు. అందుకే కాంగ్రెస్ ను, రాహుల్ గాంధీని స్వాగతిస్తున్నారు. ఆంధ్రలో కూడా ఇదే జరుగుతుంది. దీనికి సూచనలు కనిపిస్తున్నాయి.’’ అని ఆయన చెబుతున్నారు.

 

పల్లంరాజులో రాష్ట్రంలో ఉన్న  ఇంటెలెక్చువల్ పొలిటిషన్లలో  ఆగ్రశ్రేణిలో ఉంటారు. నిజాయితీ కి మారుపేరు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో పతనమయినా ఆయన రాజకీయంగా పతనం కాలేదు.యుపిఎ ప్రభుత్వంలో మంచి పదవుల్లో ఉన్నవాళ్లలో చాలా మంది 2014  తర్వాత పార్టీ వదలి తలా ఒక దిక్కు పారిపోయారు. అలా   మరో పార్టీ చూసుకుని పబ్బం గడపాలను కోలేదు పల్లం రాజు. కాంగ్రెస్ ను ప్రజలు మళ్లీ ఆదరిస్తారని ప్రగాఢమయిన విశ్వాసం ఆయన లో ఉంది.  అందుకే కష్టాలు నష్టాలు వచ్చినా  కాంగ్రెస్ తో ఉంటున్నారు. పార్టీని పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు.  ఈ రోజు ఢిల్లీలో ఆయన ‘తెలుగు రాజ్యం’ కన్సల్టెంట్ ఎడిటర్  ‘గణపతి’ తో మాట్లాడారు.  ఇదే  ఆడియో…