జనసేనాని పవన్ కళ్యాణ్.! పాపం పసివాడు.!

తెలిసో తెలియకో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘పాపం పసివాడు’ అనే పాత సినిమా తాలూకు పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సెటైర్లేశారు.!

ఇసుక దోపిడీ, సూట్ కేసు కంపెనీలు పెట్టి అక్రమార్జనకు పాల్పడటం.. వీటన్నిటి గురించీ ఆ ట్వీటులో పేర్కొన్నారు జనసేన అధినేత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘పాపం పసివాడు’ కాదు.. అని చెప్పాలన్నది జనసేనాని సెటైర్ తాలూకు ఉద్దేశ్యం.

జగన్ సంగతి పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ పరిస్థితేంటి.? ఆయన మాత్రం నిజంగానే ‘పాపం పసివాడు’.! ఇంకా పవన్ కళ్యాణ్, చంద్రబాబు చాటు పసితనపు ఛాయలు పోగొట్టుకోవడంలేదు.

2‌014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి దూరమయ్యారు. మళ్ళీ 2024 ఎన్నికల్లో టీడీపీతో కలుస్తామంటున్నారు.! ఎందుకిలా.? జనసేన పార్టీకి అంటూ సొంతంగా ఓ జెండా, ఎజెండా వుండాలి కదా.!

లేకనేం, జెండా వుంది.. ఎజెండా వుంది.. కానీ, టీడీపీని వదల్లేని పసితనం ఎందుకు.? పార్టీ కామన్ సింబల్ ‘గ్లాసు’ కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీన్ని పసితనం అని కాక.. ఇంకేమనాలి.?

అసలు జనసేన మద్దతుదారుల్లో ఎంతమందికి ఓటు హక్కు వుందో జనసేన పార్టీకి తెలుసా.? లేదా.? ముందైతే, ఆ పసితనాన్ని జనసేన వదులుకుంటే మంచిది.!