లోకేష్ బాబు కాలు పెడితే సొంత నేతలలో అసంతృప్తి

tdp leader not happy with lokesh visits

08:20:06ఆంధ్ర ప్రదేశ్ :అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత కుమారుడు నారా లోకేష్ చెప్పిందే జరిగేది, అంతా ఆయన ఇష్ట ప్రకారంగానే నడుచుకునేవారు నాయకులు, కార్య కర్తలు . ఆయన పర్యటనలకు వస్తే టీడీపీ శ్రేణులంతా నీరాజనం పలికేవారు. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయ్యింది. నారా లోకేష్ కాలు పెడితే విభేదాలు ఎక్కువ అవుతున్నాయి.

tdp leader not happy with lokesh visits
tdp leader not happy with lokesh visits

తాజాగా నారా లోకేష్ అనంతపురం పర్యటన టీడీపీలో చిచ్చుపెట్టింది. లోకేష్ అనంతపురం వచ్చి కేవలం జేసీ కుటుంబానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట.. లోకేష్ వెంట ఉండి జేసీ పవన్ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిలు వేరే ఏ టీడీపీ నేతను దగ్గరకు రానీయకపోవడంతో నేతలు భగ్గుమన్నారని ప్రచారం సాగుతోంది.

టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్, ఉన్నం హనుమంత రాయచౌదరి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులు లోకేష్ పర్యటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు టాక్. ఇదే బాటలో మాజీ మంత్రులు పరిటాల సునీత కాలువ శ్రీనివాస్ కూడా ఉన్నట్టు సమాచారం.

2014 దాకా కాంగ్రెస్ లో ఉండి టీడీపీని అణిచివేసిన జేసీ కుటుంబానికి నారా లోకేష్ అత్యంత ప్రాధాన్యతం ఇవ్వడంపై టీడీపీ నేతలు రగిలిపోతున్నారట.. జేసీ ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇస్తే తాము వైదొలుగుతామంటూ సీనియర్ మథనపడుతున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే టీడీపీ నాయకురాలు బండారు శ్రావణి వర్గం లోకేష్ తీరుపై గుర్రుగా ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు వద్ద తేల్చుకుంటామని ప్రకటించడంతో అనంతపురం టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.