ఒకే దేశం ఒకే ఎన్నిక .. ప్రధాని ప్రకటన
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు ఎర్రకోటపై నుంచి 73వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగం ప్రజలందరినీ ఎంతగానో ఆకట్టుకుంది , దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగటం , దేశ జనాభాను అదుపులో ఉంచడం , ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గించడం , దేశం కోసం సంపద సృష్టించేవారిని గౌరవించడం .. ప్రతి పక్ష పార్టీకి చెందిన పి . చిదంబరం వీటి పట్ల తన హర్షం వ్యక్తం చేశారు . ఇదే సమయంలో శివ సేన కూడా దేశం అంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ఆలోచనను పూర్తిగా సమర్ధించింది .
ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం ప్రకటించిన అంశాలన్నీ బాగున్నాయని , త్వరలో ఇవి ఆచరణలో కి వస్తాయనే నమ్ముతున్నట్టు శివ సేన ప్రకటించింది . ప్రధాని నరేంద్ర మోడీ రెండవసారి పదవీ భాద్యతలు చేపట్టిన తరువాత అనేక సమస్యలను పరిస్కరిస్తున్నారు , అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు . ఇంత కాలం దేశంలో ఎన్నికలు ఒకేసారి జరగలేదు . ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి జరుగుతున్నాయి . దీనివల్ల అధిక వ్యయం , కాలం వృధా అవుతున్నాయి . అందుకే ప్రధాని మోడీ దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరుపుతామని ఎర్ర కోట సాక్షిగా ప్రకటించారు . ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు భారత సైన్య మహాదళపతి