తెలంగాణ వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీలుగా ఉన్న గ్రూపు 4 పోస్టులకు టిఎస్ పీఎస్సీ ఆదివారం పరీక్ష నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు పేపర్లుగా గ్రూపు 4 పరీక్ష నిర్వహిస్తున్నారు.
మొత్తం 1867 పోస్టుల కోసం 6,06,579 మంది అప్లై చేసుకున్నారు. పేపర్ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరుగుతుందని టిఎస్ పీఎస్సీ తెలిపింది. అభ్యర్దులు పరీక్ష సమయానికంటే ముందే చేరుకోవాలన్నారు.
చాలా మంది అభ్యర్దులకు దూరపు కేంద్రాలలో సెంటర్లు పడ్డాయని పలువురు వాపోయారు. నల్లగొండ అభ్యర్ది నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి ఆప్షన్లు ఇచ్చుకోగా అతనికి ఖమ్మంలో సెంటర్ కేటాయించారు. ఇలా చాలా మందికి సెంటర్లు అనుకూలంగా కాకుండా దూరపు ప్రాంతాలలో కేటాయించారన్నారు. ఇలా అయితే పరీక్ష కేంద్రాలకు ఎలా వెళ్లాలి అని వారు ప్రశ్నించారు.
గ్రూపు 4 పరీక్షకి నిబంధనలివే …
పరీక్ష హాల్ లోకి బూట్లు, బంగారు నగలు వేసుకోని రావద్దు
వాచ్ లు, కాలిక్యూలేటర్లు, ఫోన్ లు తీసుకురావద్దు
సాధ్యమైనంత వరకు ఫార్మల్ డ్రెస్ లోనే రావాలి
పరీక్షకు ఎంటర్ అయిన తర్వాత పరీక్ష అయిపోయే వరకు బయటికి పంపరు
బ్లూ లేదా బ్లాక్ పెన్నుతోనే పరీక్ష రాయాలి
అనవసర పేపర్లు, పర్సులు ఉండరాదు
హాల్ టికెట్ లో పోటోలు రానివారు రెండు ఫోటోలు తెచ్చుకొని సూపరిండెంట్ తో సంతకం చేయించుకోని పరీక్షకు హాజరు కావాలి.
హాల్ టికెట్ రానివారు వెబ్ సైట్ లో ఉన్న ఫోన్ నంబర్లను సంప్రదించాలి
దూరం ఉన్న వారు ముందు రోజు వెళ్లాలి. బస్సుల కొరత ఉంటుంది కాబట్టి ముందుగా బయల్దేరేట్టు ప్లాన్ చేసుకోవాలి.
పరీక్ష ముగిసిన తర్వాత ఓఎంఆర్ కార్బన్ తో పాటుగా క్వశ్చన్ పేపర్ తీసుకెళ్లవచ్చు.
అంధులకు ఎక్స్ ట్రా 20 నిమిషాల సమయం ఇస్తారు.
మాస్ కాపీయింగ్ కు పాల్పడితే కేసు ఫైల్ చేసి కఠిన చర్యలు తీసుకుంటారు. భవిష్యత్తులో ప్రభుత్వ పరీక్షలు రాయకుండా చర్యలు తీసుకుంటారు.
అంతా సమాయానికి చేరుకోని పరీక్ష విజయవంతంగా రాయాలని టిఎస్ పీఎస్సీ తెలిపింది.